![]() |
![]() |

వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. సంయుక్త మీనన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న అభిషేక్ నామా తానే దర్శకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.
ఇప్పటికే విడుదలైన డెవిల్ టీజర్, ట్రైలర్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ "దూరమే తీరమై" అంటూ సాగే మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ సాహిత్యం అందించడంతో పాటు తానే స్వయంగా ఆలపించడం విశేషం. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ చక్కగా కుదిరి.. ఈ మెలోడీని బ్యూటిఫుల్ గా మలిచాయి. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ లపై తెరకెక్కించిన ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేలా ఉంది.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్‌గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |