![]() |
![]() |

విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.
'ఆపరేషన్ వాలెంటైన్' టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. "మన ఎయిర్ ఫోర్స్ ని ఇంకో దేశంలోకి పంపించడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే" అనే డైలాగ్ తో అదిరిపోయే విజువల్స్ తో టీజర్ ప్రారంభమైంది. "శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా" అంటూ రుద్రగా వరుణ్ తేజ్ పరిచయమైన తీరు బాగుంది. ఆకట్టుకునే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. బ్యాక్ గ్రౌండ్ లో "వందేమాతరం" వినిపిస్తుండగా.. "ఏం జరిగినా సరే చూసుకుందాం" అంటూ ఫైటర్ జెట్ తో వరుణ్ తేజ్ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా టీజర్ ని ముగించారు.
మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |