![]() |
![]() |
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఆ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా, ఐటమ్ సాంగ్స్ చేసినా అవేవీ ఆమెకు ప్లస్ అవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఆర్ఎక్స్100’ తర్వాత ఒక్క మంచి సినిమా కూడా పడలేదు. దీంతో అవకాశాల కోసం అందర్నీ రిక్వెస్ట్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ చిత్రంలో కూడా రిక్వెస్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతి ‘మంగళవారం’లో హీరోయిన్ కోసం చూస్తున్నాడని తెలుసుకున్న పాయల్ ఆ ఛాన్స్ తనకివ్వమని అజయ్‌ని అడిగింది. అజయ్‌తో ఒక సినిమా చేసి ఉండడం వల్ల ఆమెను తీసుకొని టెస్ట్ చేసి ఓకే అన్నారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. అయినా ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కాంతార టీమ్ కూడా నటీనటులు కావాలని ప్రకటించింది. దీంతో పాయల్ వెంటనే లైన్లోకి వెళ్లి ఆ ఛాన్స్ నాకివ్వండి నేను నటిస్తాను అని పబ్లిక్ ప్లాట్ ఫాం సోషల్ మీడియా వేదికగా కోరింది. మరి కాంతార ప్రీక్వెల్‌లో ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో తెలీదు.
పాయల్ అడిగి మరీ అవకాశాలు అందుకుంటున్న విషయం తెలుసుకున్న ఓ నిర్మాత తమ సినిమాలో అవకాశం ఇస్తామని ఆమెను అప్రోచ్ అయ్యాడట. కథ విని ఓకే చెప్పిన పాయల్ హీరో ఎవరు అని అడిగింది. ఆ నిర్మాత చెప్పిన పేరు విని షాక్ అయింది. అయితే ఆ హీరో ఎవరోకాదు.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు. మరి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుందా? లేక హీరో వల్ల ఆ సినిమాను వదులుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ డిస్కషన్ తర్వాత ఏం జరిగింది, పాయల్ ఓకే చెప్పిందా లేదా అనే వివరాలు తెలియలేదు.
![]() |
![]() |