![]() |
![]() |
హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు ప్రస్తుతానికి గుడ్‌బై చెప్పి తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత 6 నెలలుగా అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎక్సర్‌సైజులు చేస్తూ పర్‌ఫెక్ట్ డైట్‌ను ఫాలో అవుతోంది. చాలా వరకు ఆమె ఆరోగ్యం మెరుగుపడిరదని తెలుస్తోంది. అయితే ఆమె నెక్స్‌ట్ చేయబోయే సినిమాలు ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఫ్యాన్స్‌తో మాత్రం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతోంది. తనకు సంబంధించిన అనేక విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్, లైవ్‌లు చేస్తోంది.
ఇటీవల ఆమె నిర్వహించిన లైవ్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదా?’ అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ ‘స్టాటిస్టిక్స్ ప్రకారం.. మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. అదే విధంగా రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67 శాతంగా ఉంది. ఇక, మూడో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 73 శాతంగా ఉంది. ఈ విషయంలో స్త్రీలు, పురుషులు సమానమే అని లెక్కలు చెబుతున్నాయి’ అని సమాధానమిచ్చింది. ‘మీ నెక్స్‌ట్ ఇయర్ ప్లాన్స్ ఏమిటి?’ అని అడిగిన ప్రశ్నకు ‘మంచి ఆరోగ్యం’ అంటూ రెండు ముక్కల్లో ఆన్సర్ ఇచ్చింది. దీన్నిబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునే విషయంలో సమంత ఫుల్ క్లారిటీతో ఉందని అర్థమవుతోంది. అంతేకాదు, పెళ్లి కంటే తన ఆరోగ్యంపైనే ఆమె ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టుగా ఉంది.
ఇక ఆమె ఇటీవల చేసిన సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేసిన ‘ఖుషి’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే ఆమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పూర్తయిపోయినప్పటికీ ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. అంతేకాదు.. ‘చెన్నయ్ స్టోరీస్’ అనే హాలీవుడ్ మూవీలో కూడా నటించబోతోంది సమంత.
![]() |
![]() |