![]() |
![]() |

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించాడు. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
స్వాతంత్య్రానికి ముందు జరిగిన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథగా రూపొందిన 'డెవిల్' మూవీ ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం రిలీజ్ చేశారు. 2 నిమిషాల 19 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏజెంట్ డెవిల్ గా యాక్షన్ సన్నివేశంతో హీరో కళ్యాణ్ రామ్ ని పరిచయం చేసిన తీరు బాగుంది. బ్రిటిష్ ఏజెంట్ గా ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన డెవిల్.. చివరికి బ్రిటిష్ వారితోనే తలపడే పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కను అనుకున్నావురా.. లయన్" అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ను ముగించడం బాగుంది. మొత్తానికి అదిరిపోయే కంటెంట్, కళ్యాణ్ రామ్ గెటప్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో 'బింబిసార' వంటి మరో బ్లాక్ బస్టర్ ఖాయమనిపిస్తోంది.
![]() |
![]() |