![]() |
![]() |
‘డాన్‌శీను’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ మలినేని ఆ తర్వాత బలుపు, క్రాక్ వంటి సూపర్‌హిట్ సినిమాలు చేసి రవితేజతో హ్యాట్రిక్ కొట్టాడు. రామ్‌తో పండగ చేస్కో, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించాడు. ఇప్పుడు తన నెక్స్‌ట్ రవితేజతో చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అంటూ ఏమీ లేదు. దీంతో గోపీచంద్ మలినేని నెక్స్‌ట్ ప్రాజెక్ట్ అయోమయంలో పడిరది. ఎవరితో సినిమా చెయ్యాలి అనే విషయంపై కసరత్తు చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సన్ని డియోల్‌తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. అయితే ఈ పాజ్రెక్ట్‌కి సంబంధించి ఎటువంటి అనౌన్స్‌మెంట్ జరగలేదు.
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 12 సూపర్‌స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు రజినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడు. ‘సూపర్‌స్టార్ రజనీకాంత్ సార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీ తేజస్సు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మీకు ఈ సంవత్సరమంతా ప్రేమతో నిండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్ రజినీకాంత్’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. రజనీ, గోపీచంద్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని కన్‌ఫర్మ్ చేస్తున్నారు. మాస్ సీన్స్‌తో రజనీ సినిమా నింపేయమని కొందరంటున్నారు. బాలయ్యతో మీరు తీసిన సినిమా.. తలైవాకు నచ్చిందని అందుకే మీ కాంబో కోసం వెయిటింగ్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య-గోపీచంద్ కాంబోలో తెరకెక్కిన కంప్లీట్ యాక్షన్ డ్రామా వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రజనీ కూడా గోపీచంద్‌కు కాల్ చేశారు. ఈ విషయాన్ని గోపీచందే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఇది నాకు నమ్మలేని క్షణం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటి కంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్’’ అని ట్వీట్ చేశారు.
![]() |
![]() |