![]() |
![]() |
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సలార్’పై ఎంత బజ్ ఉందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 15న రెండో ట్రైలర్ కూడా విడుదల కానుంది. అయితే డిసెంబర్ 13న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తామని డిసెంబర్ 12న మేకర్స్ వెల్లడిరచారు. ‘సూరీడే..’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్నందిస్తున్నారు.
ప్రేక్షకులు, అబిమానులు ఎంతగానో ఎదురుచూసిన ట్రైలర్ డిసెంబర్ 1న విడుదలైంది. ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోసన్స్‌ను స్పీడప్ చెయ్యాల్సిన అవసరం ఉంది. కానీ, చిత్ర యూనిట్ మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది. అయితే రేపు ‘సలార్’కి సంబంధించి ఫస్ట్ సింగిల్ రాబోతోందన్న వార్త వారిని సంతోషపెడుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండదని తెలుస్తోంది.
‘సలార్’లో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ కాగా.. జగపతిబాబు, బాబి సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరిరావు శ్రీయారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగరదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘సలార్’ రిలీజ్ కానుంది.
![]() |
![]() |