![]() |
![]() |

కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు, దర్శకుడు,నిర్మాత అయిన విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఒంటరి తనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పట్లో ఈ విషయం విజయ్ అభిమానులతో పాటు చాలా మందిని బాధించింది.ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులు అయితే ఆ సంఘటన నుంచి ఇంకా కోలుకులేదు. తాజాగా మీరా తల్లి తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పలువురిని కంట తడిపెట్టిస్తుంది.
మీరా తల్లి పేరు ఫాతిమా ఆంటోనీ తాజాగా ఈమె తన ట్విటర్ లో మీరా ని తలుచుకుంటూ అమ్మ మీరా నీ పియానో నీ తాలూకు టచ్ తన మీద లేదని బాధపడుతుంది. నువ్వు లేవని అది బాధపడే విషయం మాకు తెలుస్తుంది. అలాగే నువ్వు మళ్ళీ వచ్చి తనని తాకుతావని అది ఎంతగానో ఎదురు చూస్తుంది. మీరా నువ్వులేవనే విషయాన్ని మేము నమ్మలేకపోతున్నాం. ఈ వరల్డ్ నీ కోసం లేదమ్మా కానీ మీ అమ్మని అయిన నేను ఇంకా ఇక్కడే ఉన్నాను.అమ్మ మీరా చావు బతుకుల మధ్య ఉన్న గీత నాకు అర్ధం కావడంలేదు. బహుశా నేను చనిపోయి నీ దగ్గరికి వచ్చేవరకు ఆ విషయం నాకర్ధం కాదేమో. నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడ బాగా తిని రెస్ట్ తీసుకో అని ఆమె పేర్కొంది.ఇప్పుడు ఫాతిమా చేస్తున్న సోషల్ మీడియాలో ఫాతిమా చేసిన ఈ వ్యాఖ్యలుని పలువురు చూస్తు ఆమెకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.
విజయ్ ఫాతిమాలు నిత్యం తమ సినిమాల వ్యవహారంలో బిజీ గా ఉంటారు. ఈ కారణంతోనే మీరా ఒంటరి తనాన్ని భరించలేక తన ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. కాగా ఇప్పుడు విజయ్, ఫాతిమాలు తమ రెండో కూతురు లారాని తమతో పాటే అన్ని ఫంక్షన్స్ కి తీసుకెళ్తున్నారు.
![]() |
![]() |