![]() |
![]() |

విశ్వకధానాయకుడు కమల్ హాసన్ కి శృతి హాసన్ తో పాటు అక్షర హాసన్ అనే ఇంకో కూతురు కూడా ఉందనే విషయం అందరికి తెలిసిందే. తన తండ్రిలాగా అక్కలాగా సినిమాల్లో రాణించాలని కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్షర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ మధ్యన అక్షర గురించి బయటకి ఎలాంటి వార్తలు రాకపోయినా ఇప్పుడు ఆమె మాజీ ప్రియుడి పెళ్లి ద్వారా అక్షర ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.
బాలీవుడ్ కి చెందిన ఒకప్పటి అగ్రనటి రతి అగ్నిహోత్రి ముద్దుల తనయుడు పేరు తనూజ్ విర్వానీ. బాలీవుడ్ లో కొన్నిసినిమాల్లో నటించినా కూడా అంతగా గుర్తింపు రాలేదు.లేటెస్ట్ గా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నాడు.ఈ తనూజ్ విర్వానీ అక్షర హాసన్ లు ఒకప్పుడు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని తమ ప్రేమకి ముగింపు పలికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

ఇప్పడు తనూజ్ వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధం అయ్యాడు.ఎంగేజ్ మెంట్ జరిగిన పిక్స్ ని తనూజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ పిక్స్ చూస్తున్న వాళ్ళందరు కమల్ హాసన్ కి అల్లుడు అవ్వాలసిన తనూజ్ వేరే వాళ్ళకి అల్లుడు అవుతున్నాడని ఇదే కదా విచిత్రం అంటే అని అనుకుంటున్నారు.
![]() |
![]() |