![]() |
![]() |

ఒందు కతే హెల్లా అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నటి ప్రియాంక మోహన్. చెన్నై కి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపుని పొందింది. తెలుగులో కూడా నటిస్తూ తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న ప్రియాంక ఈ రోజు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
నిన్నప్రియాంక మోహన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజి లో ప్రియాంక హీరోయిన్ గా చేస్తుంది. అలాగే నాని న్యూ మూవీ సరిపోదా శనివారంలో కూడా తనే హీరోయిన్. ఈ రెండు సినిమాలు కూడా డివివి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పైనే నిర్మాణం అవుతున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆమెకి శుభాకాంక్షలు చెప్తు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

గ్యాంగ్ లీడర్, డాక్టర్,శ్రీకారం లాంటి పలు సినిమాల్లో చక్కగా నటించి చాలా మంది అభిమానులని ప్రియాంక మోహన్ సంపాదించుకుంది. ఓజి, సరిపోదా శనివారం లాంటి భారీ సినిమాలతో ప్రియాంక రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తుంది.
![]() |
![]() |