![]() |
![]() |
అక్కినేని నాగార్జున వారసుల్లో నాగచైతన్య హీరోగా మంచి పేరు తెచ్చుకొని అప్ అండ్ డౌన్స్‌తో కెరీర్‌ని లాక్కొస్తున్నాడు. ఇక అఖిల్ అక్కినేని మాత్రం ఇప్పటి వరకు తన ఖాతాలో ఒక్క హిట్ కూడా వేసుకోలేదు. వరస ఫ్లాపులతో తీవ్రమైన నిరాశలో ఉన్న అఖిల్‌కి ‘ఏజెంట్’ రూపంలో మరో పెద్ద దెబ్బ పడిరది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. నిర్మాతలకు విపరీతమైన నష్టాలను తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత చాలా నెలలు ఎవ్వరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయాడు అఖిల్. ఆ సినిమా తర్వాత మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు.
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ సినిమా చేయబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. యువి క్రియేషన్స్ సంస్థ అఖిల్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏజెంట్ రిలీజ్ అయిన వెంటనే ఈ సంస్థకు అఖిల్ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిరది. ఇప్పుడు ఈ సినిమా ప్రారంభానికి అంతా ఓకే అయిందని తెలుస్తోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో అఖిల్ నెక్స్‌ట్ సినిమా ఉంటుందని సమాచారం. అనిల్‌కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇదిలా ఉంటే.. అఖిల్ కొత్త సినిమా అనగానే వారిలో ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ కాదు, కథ ముఖ్యం. ఈసారైనా అఖిల్ మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో అఖిల్ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ‘ఏజెంట్’ డిజాస్టర్ అయినా బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అంటున్న అఖిల్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో.. కొత్త దర్శకుడు అఖిల్‌కి సూపర్‌హిట్ అందిస్తాడా అనేది తెలియాలంటే ఇంకా చాలా ఆగాల్సిందే.
![]() |
![]() |