![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా'కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని మిగతా సాంగ్స్ కూడా అదిరిపోతాయని, కనీసం ఓ ఏడాది పాటు మోతమోగిపోతాయని అంటున్నారు.
సోమవారం నాడు 'ఆదికేశవ' మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత నాగవంశీ.. 'గుంటూరు కారం' అప్డేట్ ఇచ్చారు. "గుంటూరు కారంలో ఇంకా మూడు పాటలున్నాయి. రెండో సాంగ్ వచ్చే వారం విడుదల చేస్తున్నాం. పాటలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ అంతా పాడుకుంటారు. అంత బాగుంటాయి." అన్నారు నాగవంశీ.
జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |