![]() |
![]() |
.webp)
జైలర్ తో సంచలన విజయం సాధించిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తన తదుపరి చిత్రాన్ని టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తలైవర్ 170 గా తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయ్యింది. అయితే తాజాగా రజనీ కాంత్ ఉన్నట్టుండి ముంబైలో ప్రత్యక్షమవ్వడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
సూపర్ స్టార్ రజనీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యి మీడియా కంట పడ్డాడు. ఆ తర్వాత వాంఖేడ్ స్టేడియం ఏరియా దగ్గరలో కూడా కనపడ్డాడు. అప్పుడు గాని అసలు విషయం అందరికి తెలియలేదు.మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ ఇండియా న్యూజిలాండ్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై వెళ్ళాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అభిమానులు ఇండియా ఎలాగైనా ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి గత వరల్డ్ కప్ లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకోవాలని రజనీ కాంత్ కోరుకుంటున్నాడని అందుకే ముంబై కి వచ్చాడని అంటున్నారు.
కొంత మంది అయితే రజనీ లో ఇండియా,న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ మొదలయిందని అందుకే దగ్గరుండి మరి ఇండియాని ఎంకరేజ్ చెయ్యడానికి వెళ్లాడని అంటున్నారు. ముంబైకి సంబంధించిన రజనీ పిక్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ప్రతి భారతీయుడు కూడా ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ మీద ఇండియా గెలిచి గత వరల్డ్ కప్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.
![]() |
![]() |