![]() |
![]() |

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎందరో హీరోలుగా మారి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే బాటలో పయనిస్తూ బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ కూడా ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను నటించిన తాజా చిత్రం 'సౌండ్ పార్టీ'.
ఫుల్ మూన్ మీడియా పతాకంపై రూపొందిన `సౌండ్ పార్టీ` చిత్రంలో వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత రవి పోలిశెట్టి మాట్లాడుతూ.. "ఇప్పటికే విడుదలైన మా `సౌండ్ పార్టీ` చిత్రం టీజర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజంట్ ఆడియన్స్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. అదే తరహాలో తెరకెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం. వరల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం" అన్నారు.

దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ... "నిర్మాతలు ఇచ్చిన ఫ్రీడంతో సమర్పకులు జయ శంకర్ సపోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను. ఇటీవల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. మా చిత్రానికి పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఒక మంచి సినిమా చేయగలిగా. ఇప్పటికే టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న వస్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మోహిత్ రెహమానిక్, డీఓపీగా శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ గా జి. అవినాష్ వ్యవహరించారు.
![]() |
![]() |