![]() |
![]() |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'సీతా రామం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ చేతిలో 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే డేటింగ్ వార్తలతో ప్రస్తుతం ఈ అమ్మడి పేరు మారుమోగిపోతోంది.

రీసెంట్ గా దీపావళి సందర్భంగా నటి శిల్పాశెట్టి ఒక పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్షా(ఆదిత్య ప్రతీక్ సింగ్) సహా పలువురు హాజరయ్యారు. అయితే ఆ పార్టీ సమయంలో దిగిన ఫొటోలలో మృణాల్, బాద్షా చనువుగా ఉన్నట్టు కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ డేటింగ్ వార్తలపై తాజాగా బాద్షా క్లారిటీ ఇచ్చాడు. "డియర్ ఇంటర్నెట్ మిమ్మల్ని మరోసారి నిరాశకు గురిచేస్తున్నందుకు సారీ. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదు" అంటూ బాద్షా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

![]() |
![]() |