![]() |
![]() |

టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడైన నితిన్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ఒక న్యూస్ నితిన్ హీరోయిజానికి ఉన్న స్టామినాని తెలియజేస్తుంది.
నితిన్ అండ్ వంశీ కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు ఈ మూవీ పలు సంచలనాలని నమోదుచేస్తుంది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 8 వ తేదీన విడుదల అవ్వబోతుంది. కానీ అంతకంటే ముందే డిసెంబర్ 7 న ప్రీమియర్ షో లతో ఓవర్సీస్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తుంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ వీరనరసింహారెడ్డి, మహేష్ సర్కారు వారి పాట విజయ్ వారసుడు ఇలా ఎన్నో చిత్రాలని శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ఛేంజర్ మూవీ కూడా శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారానే ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతుంది.

ఇటీవలే వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ తో ప్రేక్షకుల్లో సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. నితిన్, శ్రీ లీలల మధ్య వచ్చిన సన్నివేశాలు గాని ,నితిన్, రావు రమేష్ వచ్చిన సన్నివేశాలు గాని అదిరిపోయాయి. అలాగే మిర్చి ఫేమ్ సంపంత్ రాజ్ తో నేను బాహుబలి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసానని నితిన్ చెప్పడంతో పాటుగా బాహుబలి సినిమాలోని దండాలయ్యా సాంగ్ బ్యాక్ డ్రాప్ లో జూనియర్ ఆర్టిస్ట్ ల్లో ఒకడిగా నితిన్ కనిపించడం సూపర్ గా ఉంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ ని అందిస్తున్న ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీని ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ల సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి మరియు నికితారెడ్డి లు నిర్మిస్తున్నారు. సుదేవ్ నాయ్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజౌ, హర్ష వర్ధన్, రవివర్మ, హరి తేజ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు మిగతా పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |