![]() |
![]() |
సినిమా తారలు ప్రేమలో త్వరగా పడిపోతారు, పెళ్లి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు, విడిపోవడానికి కూడా ఎక్కువ సేపు ఆలోచించరు. అంతే తొందరగా విడిపోతారు. ఇప్పటివరకు ఎన్నో ప్రేమలు, పెళ్లిళ్ళు విడాకులతో ముగిసిపోయాయి. ఇలాంటి తొందరపాటు నిర్ణయమే ఓ హీరోయిన్ తీసుకుంటోందని అర్థమవుతోంది. నటి పాయల్ ఘోష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కొని ఇబ్బంది పడుతోంది. ఈ వివాదాలకు తన నోరే కారణమని అందరూ అంటున్నారు. తొందరపడి నోరు జారడం వల్లే ఆమెను వివాదాలు చుట్టుముట్టాయట.
ఇప్పుడు మరో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తున్న మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటుందట. సోషల్ మీడియా ద్వారా అతనికి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో మహమ్మద్ షమీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్‌లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. షమీ బౌలింగ్‌కు పాయల్ ఘోష్ ఫిదా అయిపోయింది. షమీని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించేసింది. అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉందా లేదా అనేది తెలీదు. కేవలం వన్ సైడ్ లవ్‌గా అనిపిస్తోంది. అతని బౌలింగ్‌కి ముచ్చటపడి ఏకంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తనను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండీషన్ ఉంది అని చెప్పింది. అదేమిటంటే షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగు పరుచుకోవాలట. పాయల్ పెట్టిన కండీషన్ చూసి అందరూ విస్తుపోతున్నారు. పెళ్లికి, అతను ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవడానికి సంబంధం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. పాయల్ పెట్టిన పెళ్లి ప్రపోజల్‌ని షమీ ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలీదు. ఇప్పుడు పాయల్ తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల మళ్లీ ఎలాంటి వివాదాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
![]() |
![]() |