![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వం ఏ రేంజ్ లో ఉంటుందో భారతీయ చిత్ర పరిశ్రమకి తెలిసేలా చేసిన నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని చేస్తున్నాడు. ఇటీవలే ప్రముఖ నటుడు తన సోదరుడు అయిన వరుణ్ తేజ్ వివాహ వేడుకలకి సంబంధించి ఇటలీ వెళ్లి వచ్చిన చరణ్ ఇప్పుడు లేటెస్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
రిలయన్స్ అధినేత అయిన అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్ లో స్వదేశ్ హస్తకళా స్టోర్ ని ప్రారంభించింది. అంబానీ సతీమణి ఆహ్వానం మేరకు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. స్టోర్ లో ఉన్న స్వదేశీ హస్త కళలకి సంబంధించిన వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన చరణ్ అంబానీ గ్రూప్ కి కంగ్రాట్స్ కూడా చెప్పాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చరణ్, ఉపాసనలతో కలిసి దిగిన పిక్ ని తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చెయ్యడంతో చరణ్ ఆ కార్యక్రమం లో పాల్గొన్న విషయం అందరికి తెలిసింది. ప్రస్తుతం ఆ బ్యూటిఫుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంకా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్,టెన్నిస్ ప్లేయర్స్ సానియా మీర్జా, పీవీ సింధు, ప్రముఖ నటి మంచు లక్ష్మి లు పాల్గొన్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి దీపావళి కి ఒక సాంగ్ విడుదల కాబోతుంది. దీంతో చరణ్ ఫాన్స్ లో గేమ్ ఛేంజర్ మూవీ హంగామా స్టార్ట్ అయ్యింది.
![]() |
![]() |