![]() |
![]() |

సినిమా పరిశ్రమలో అగ్ర హీరో గా ఎదగాలంటే ఎంత కష్టమో అగ్ర హీరోయిన్ గా ఎదగటం కూడా అంతే కష్టం. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ రెండింటిలోను గెలిచి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి రష్మిక. ఇటీవల ఏ .ఐ టెక్నాలజీ తో రష్మిక పేస్ ని మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రష్మిక చేసిన ఒక ట్వీట్ రష్మిక అంటే ఏంటో ప్రేక్షకులకి తెలిసేలా చేసింది.
రష్మిక కి సంబంధించిన ఫేక్ వీడియో రష్మిక ని షాక్ కి గురిచెయ్యడమే కాకుండా టోటల్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. బాష తో సంబంధం లేకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రష్మిక ఫేక్ వీడియో ని ఖండిస్తూ రష్మిక కి మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా రష్మిక కి పూర్తి మద్దతు లభించింది. అంతే కాకుండా ఆమెకి అండగా ఉన్నామనే భరోసాని ఇస్తు పోలీసు కేసు ని కూడా ఫైల్ చేసి రష్మీకకి ధైర్యం చెప్పింది. దీంతో రష్మిక తనకి సపోర్ట్ గా నిలిచిన తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలుపుతు ఒక ట్వీట్ ని చేసింది.
చలో సినిమాతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలతో అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. తొలి సారిగా హిందీలో రణబీర్ కపూర్ తో కలిసి ఆమె చేసిన యానిమల్ మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |