![]() |
![]() |

కేవలం నాలుగైదు సినిమాలతోనే దర్శకుడిగా తనకంటూ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కేవలం నాలుగు సినిమాలతోనే తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఆయన డైరెక్షన్ లో రూపొందిన 'లియో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దళపతి విజయ్ స్టార్‌డం కి తోడు లోకేష్ బ్రాండ్ తోడు కావడంతో ఈ సినిమా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ రాబడుతోంది. అయితే సినిమా మాత్రం డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. లోకేష్ మ్యాజిక్ మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన ఐదు సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ ఏదనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
2017 వేసవిలో విడుదలైన 'మానగరం'తో లోకేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
కార్తీ హీరోగా లోకేష్ డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ' 2019 అక్టోబర్ లో విడుదలైంది. ఈ సినిమాతో ఒక్కసారిగా లోకేష్ పేరు మారుమోగిపోయింది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. హీరోయిన్, లవ్ ట్రాక్, సెపెరేట్ కామెడీ ట్రాక్ అనేది లేకుండా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో లోకేష్ చిత్రాన్ని మలిచిన తీరుకి అందరూ ఫిదా అయ్యారు.
విజయ్ దళపతి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో లోకేష్ రూపొందించిన కమర్షియల్ ఫిల్మ్ 'మాస్టర్' 2021 జనవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో లోకేష్ హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ అయ్యాడు.
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేష్ తెరకెక్కించిన 'విక్రమ్' మూవీ 2022 జూన్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలైంది. 'ఖైదీ' సినిమాతో విక్రమ్ సినిమాని లింక్ చేస్తూ లోకేష్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఓ వైపు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రేజ్, మరోవైపు 'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్-కాంబోలో రూపొందిన సినిమా కావడంతో విడుదలకు ముందు 'లియో'పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అయితే గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా లోకేష్ గత చిత్రాల స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. కొందరైతే మాకు పాత లోకేష్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా లోకేష్ బెస్ట్ ఫిల్మ్ ఏంటనే చర్చ మొదలైంది. అయితే మెజారిటీ నెటిజన్లు 'ఖైదీ'నే బెస్ట్ ఫిల్మ్ అని అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |