![]() |
![]() |
.webp)
ఏ మాయ చేసావు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే అగ్రకధానాయికిగా ఎదిగిన నటి సమంత.. దాదాపు తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరి సరసన ఆమె నటించి తన కంటూ సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేసి ప్రేక్షుకుల్ని అలరించింది..ఆ తర్వాత ట్రీట్ మెంట్ కోసం అమెరికాకి వెళ్ళింది.ఇప్పటికి అమెరికాలోనే ఉన్న సమంత తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పిక్ చర్చినీయాంశం అయ్యింది.
సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి కి సంబంధించిన ట్రీట్ మెంట్ కోసం సమంత గత నెల ఆగస్ట్ చివరలో అమెరికా కి వెళ్ళింది. దాంతో సమంత అభిమానులు సమంత ఆరోగ్య విషయంలో చాలా కంగారు పడ్డారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకొని కోలుకుంటున్నాని సమంత చెప్పడంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి సమంత ఆరోగ్యం బాగోలేదనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమంత తనఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ ని చూసిన ఫాన్స్ సమంత ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్నారు.
సమంతకి మొదటి నుంచి కూడా బ్రెడ్ ,బట్టర్ ,జామ్ అంటే చాలా ఇష్టం. కానీ తనకున్న వ్యాధి వలన వాటికీ ఇన్నాళ్లు దూరంగా ఉన్న సామ్ ఇప్పుడు వాటిని తింటున్నట్టుగా పిక్ పెట్టింది. దీంతో సామ్ అభిమానులు సమంత ఆరోగ్యం కుదుటపడిందని భావిస్తున్నారు. అలాగే తనకున్న మాయోస్టిస్ ప్రాబ్లెమ్ వల్ల నట్స్,బంగాళాదుంప, టమోటా, గుడ్డు,పాలు వంటి పదార్ధాలని సమంత పక్కన పెట్టింది.
![]() |
![]() |