![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'భగవంత్ కేసరి' నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. షో షోకి బుకింగ్స్ ని పెంచుకుంటోంది. దీంతో ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్ళు రాబడుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే 'అఖండ'ను మించిన ఓపెనింగ్స్ రాబట్టేలా ఉంది.
వరల్డ్ వైడ్ గా రూ.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'భగవంత్ కేసరి'.. రూ.68 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రూ.7 కోట్ల దాకా ఉంది. సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈవెనింగ్, నైట్ షోల బుకింగ్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుత జోరు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో రూ.15-17 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. వరల్డ్ వైడ్ గా రూ.18-20 కోట్ల షేర్ రాబట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ 'అఖండ' మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల షేర్ రాబట్టింది. 'భగవంత్ కేసరి' అంతకుమించిన ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |