![]() |
![]() |
ఈమధ్యకాలంలో విజయ్ సినిమాల్లో ‘లియో’కి వచ్చినంత హైప్ మరే సినిమాకీ రాలేదు. లియోకి సంబంధించిన ప్రతి అంశంపై అందరూ ఆసక్తి కనబరిచారు. దానికి ప్రధాన కారణం.. ‘మాస్టర్’ తర్వాత లోకేష్ కనకరాజ్‌తో విజయ్ సినిమా చేయడం. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. చివరికి ఆరోజు రానే వచ్చింది అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. చిత్ర యూనిట్ మొదటి నుంచీ ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్‌తో ఉంది. దానికి తగ్గట్టుగానే మొదటి షోకే మంచి టాక్ సంపాదించుకుంది. ఎక్కడ ఎలా ఉన్నా తమిళ్‌లో మాత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం పట్ల ఎంతో మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. ‘‘లియో’ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. విజయ్ పెర్‌ఫార్మెన్స్ నెక్స్‌ట్ లెవల్ అన్నట్టుగా ఉంది. అనిరుధ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిజంగా సూపర్. ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఉంది. అదేమిటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఆ సర్‌ప్రైజ్‌ను థియేటర్‌లో చూసి థ్రిల్ అవ్వండి. చివరి 30 నిమిషాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి’’ అని పోస్ట్ చేశాడు ప్రశాంత్ నీల్.
సినిమాకి సూపర్‌హిట్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు థియేటర్ల దగ్గర భారీ హంగామా చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విశేషం ఏమిటంటే విజయ్‌ను అభిమానించే ఓ జంట ఏకంగా థియేటర్‌లోనే పెళ్లి చేసుకున్నారు. చెన్నయ్‌లోని ఓ థియేటర్‌లో వెంకటేష్, మంజూష అనే జంట ప్రేక్షకుల ఎదుట దండలు మార్చుకోవడమే కాకుండా ఉంగరాలు కూడా మార్చుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 20న పెళ్లి కానుంది. అయితే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన థియేటర్‌లో ఇలా ముందుగానే ప్రేక్షకులు, అభిమానుల సాక్షిగా పెళ్ళి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రోజు కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నామని, తమ అభిమాన హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమా థియేటర్‌లో ఇంత మంది ముందు పెళ్లి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెంకటేష్, మంజూష తెలిపారు.
![]() |
![]() |