![]() |
![]() |
.webp)
యష్ నెక్స్ట్ సినిమా కన్‌ఫర్మ్ అయింది. ఆదివారం యష్ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతి ఏడాదీ ఫ్యాన్స్ ని మీట్ అయ్యే యష్ ఈ సారి ఊళ్లో ఉండనని, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని ముందుగానే లెటర్ రాశారు. లేటెస్ట్ గా ఆయన పుట్టినరోజున యష్19కి సంబంధించి గుడ్‌న్యూస్ వచ్చేసింది. కేవీయన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు యష్‌తో కొలాబరేట్ అయిన న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ప్యాన్ ఇండియన్ స్టార్ యష్19 మూవీని నిర్మిస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. యష్‌తో లోహిత్ ఎన్‌కే ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు? మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట. ధ్రువ సర్జాతో కేడీ ది డెవిల్ అనే మూవీని తెరకెక్కించింది ఈ నిర్మాణ సంస్థే.
37 ఏళ్ల యష్ ఇప్పుడు బెంగుళూరులో లేరు. తన తదుపరి సినిమా పనుల్లోనే పూర్తిగా నిమగ్నమయ్యారన్నది సన్నిహితుల నుంచి అందుతున్న మాట. మరోవైపు యష్ తన కేజీయఫ్ లుక్‌లోనే ఇంకా ఉన్నారు. ఇప్పుడు యష్19కి కూడా సేమ్ లుక్ ఉంటుందా? లేకుంటే బెంగుళూరుకి తిరిగి వచ్చే సరికి నయా లుక్‌లో ఉంటారా? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. యష్‌తో గత కొన్నేళ్లుగా ట్రావెల్ చేస్తున్న హోంబలే సంస్థ యష్‌ని పుట్టినరోజు సందర్భంగా విష్ చేసింది. కేజీయఫ్2 సక్సెస్ అంత తేలిగ్గా మర్చిపోలేనిదని చెప్పింది. యష్‌తో కేజీయఫ్3 త్వరలోనే ఉంటుందని కూడా చూచాయగా చెప్పింది. ఈ విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
హోంబలే సంస్థ ప్రస్తుతం సలార్ మూవీని తెరకెక్కిస్తోంది. మరోవైపు నియర్ ఫ్యూచర్‌లో ఐదు వేల కోట్లతో సినిమాలను, సినిమా సంబంధిత వ్యాపారాలను చేయనున్నట్టు ప్రకటించింది. ఈ బడ్జెట్‌లో యష్ మూవీస్ కోసం సాలిడ్‌గా అమౌంట్ కేటాయించి ఉంటారన్నది కర్ణాటకలో వైరల్ అవుతున్న న్యూస్.
![]() |
![]() |