![]() |
![]() |

కమల్ హాసన్ అనగానే మనకు ఆకలి రాజ్యం లో నిరుద్యోగి... స్వాతిముత్యం మంద బుద్ధి కలిగిన ఓ అమాయకుడు, సాగర సంగమంలో నాట్యాన్ని దైవంగా భావించే నాట్య కళాకారుడిగా కనిపిస్తారు. ఆయన లోకనాయకుడు, విశ్వనటుడు అయినప్పటికీ ఆయన తీరే వేరు. ఏ సినిమా చేసినా తన పాత్రకు 100కు 1000% న్యాయం చేసే ఏకైక నటుడు లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రమే. అలాంటి లోకనాయకుడు కమల్ హాసన్‌కు ఇటీవల సరైన సక్సెస్ రాలేదనే చెప్పాలి. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
దశావతారం తర్వాత ఈనాడు, విశ్వరూపం1, ఉత్తమవిలన్, పాపనాశం, చీకటి రాజ్యం, విశ్వరూపం2 చిత్రాలలో నటించాడు. వీటిలో విశ్వరూపం తప్పించి మరే చిత్రం సరిగా ఆడలేదు. అలాంటి సమయంలో ఆయనకు ఎవరూ ఊహించని... నటుడిగా తన విశ్వరూపాన్ని చూపించే చిత్రం చాలా కాలానికి వచ్చింది. అదే విక్రమ్... 2022 లో మైండ్ బ్లాక్ అయ్యే మూవీగా విక్రమ్ ని చెప్పుకోవచ్చు. విశ్వ నటుడి నుంచి సరైన ఔట్పుట్ తీసుకొనే మగాడు లాంటి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కమల్ హాసన్ని అద్భుతమైన పాత్రలో చూపిస్తూ విక్రమ్ తెరకెక్కించారు. లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం, అద్భుతమైన సంభాషణలు, స్క్రీన్ ప్లే వరంగా ఆయన మిరాకిల్ చేశాడనే చెప్పాలి.
ఇకపై విక్రం ఫ్రాంచైజీ తో దుమ్ముదులిపే ఆలోచనలో లోకేష్ కనకరాజు ఉన్నారు. అందుకోసం కమలహాసన్ ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కమల్‌హాసన్ తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లోకేష్ కనకరాజు వినిపించారట. కొత్త ఇయర్ సందర్భంగా కమలహాసన్ ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కమల్ హాసన్ ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో చిన్నహింట్ ఇచ్చేలా ఈ ఫోటోని షేర్ చేశాడు.అందులో అతను ఒక చిన్న పిల్లాడి లాగా నూతన సంవత్సరాన్ని ఆస్వాదించాడని తెలుస్తోంది. స్వాతిముత్యం చిత్రంలో కమలహాసన్ డాన్స్ చేసే మూమెంట్ లాగానే ఈ ఫొటో కూడా ఉంది. కమల్ హాసన్ ఇప్పటికీ ఎప్పటికీ యంగ్ మైండెడ్ గా ఆలోచిస్తారు. కమల్ హాసన్ తన తదుపరి చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో చేస్తున్నారు. గతంలో కమల్ -మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు చిత్రం ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు.
ఆనాడు ఆస్కార్ వద్ద ఆర్.ఆర్ ఆర్‌ను మించిన సందడి చేసింది. అప్పట్లో సోషల్ మీడియా ఇతర మీడియా అంత విస్తృతంగా లేవు. కాబట్టి అంతగా హడావుడి లేదు. కాగా నాయకుడు చిత్రం 1987లో విడుదలయ్యింది. 35 ఏళ్ల తర్వాత మరలా కమల్, మణిరత్నంల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ప్రస్తుతం కమలహాసన్ శంకర్ దర్శకత్వంలోఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇండియన్ మూవీ కూడా ఎంతటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. భారతీయుడిగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. నాయకుడు, భారతీయుడులకు వచ్చిన అవార్డులు అన్ని ఇన్ని కావు. ఇక మణిరత్నం చిత్రానికి కమల్ హాసన్ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారట. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. కిందటి ఏడాది అంటే 2022 కమలహాసన్ కు తీపి సంవత్సరంగానే చెప్పుకోవాలి. మరి ఈ ఏడాది అతని నుంచి విడుదల కాబోతున్న ఇండియన్ 2 చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి....!
![]() |
![]() |