![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సహా సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కన్నడ కస్తూరి రష్మికా మందనాన్ని చెప్పుకోవచ్చు. తాజాగా ఈమె బాలీవుడ్‌లో అడుగుపెట్టి వరుస సినిమాలతో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క కిచ్చా సుదీప్ ఇప్పటికే తెలుగు చిత్రాలతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. వీరిద్దరూ కన్నడ కంటే ఇతర భాష చిత్రాలపై మోజు ఎక్కువగా చూపిస్తుంటారు. ఇక రష్మిక మందన్న ఇటీవల ఏదో ఒక నెగటివ్ కామెంట్స్ తో హెడ్ లైన్స్ లోకి వస్తోంది. కాంతారా తాను చూడలేదని చెప్పి పెద్ద వివాదాన్ని రేపింది. అది రిషబ్ శెట్టి అభిమానులకు రుచించలేదు. రిషబ్ శెట్టి ఎవరో కాదు.... రష్మిక మందన ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం కూడా చేసుకున్న దర్శకుడు, నటుడు రక్షిత్ శెట్టి కజిన్. మొత్తానికి పనిలో పనిగా రష్మిక తన వ్యాఖ్యల ద్వారా లక్షలాది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటుంది.
ఇక 2017లోనే రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న రష్మిక మందన్నాను ఆయన అభిమానులు నాటి నుంచి ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో కిచ్చా సుదీప్, రష్మిక మందన కు అండగా నిలిచారు. ఆయన ఆమెను సమర్థిస్తూ ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది అటు ఉంచితే ఇలా కించపరచడం సరికాదని రక్షిత్ అభిమానులను అదుపు తప్పకుండా ఆపే ప్రయత్నం చేశారు. దాంతో రష్మిక మందన సైతం సుదీప్ గొప్ప రక్షకుడిగా ఉండే సహనటుడు అంటూ కితాబు ఇచ్చేసింది. అప్పట్లో సుదీప్, రష్మికను సమర్థిస్తూ ఒక ఎమోషనల్ నోటు రాశారు. రెండేళ్లకు పైగా రష్మిక నాకు తెలుసు. మీ అందరికంటే నాకు బాగా తెలుసు. ఇక్కడ కెరీర్ ముఖ్యం. దయచేసి తన నిర్ణయం పై తీర్పు చెప్పడం మానేయండి. తనను ప్రశాంతంగా ఉండనివ్వండి... అని సుదీప్ రష్మిక వ్యతిరేకులను అభ్యర్థించారు. సోషల్ మీడియాలో రక్షిత అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం ఆపాలని అభ్యర్థించారు. ఇక ఇప్పుడు మరోసారి రష్మిక మందన్న కాంతారా చిత్రం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజెన్లు ఆమెను మరోసారి ట్రోల్ ప్రారంభించారు. ఇప్పుడు కూడా మరోసారి సుదీప్ తనకు అండగా నిలిచారు. ఓసారి సెలబ్రిటీగా పబ్లిక్ ఫిగర్ గా మారితే పూలదండలతో పాటు గుడ్లు టమేటాలు కూడా పడతాయి. అన్నింటినీ ఎదుర్కొంటేనే బలంగా మారుతాం. ఇలాంటివి ఎదుర్కొనే దశలోనే రష్మిక ఉంది. లక్షల్లో ఫాలోవర్స్ కావాలనుకునే రష్మికకు ఇలాంటివి తప్పదు అని కిచ్చా పంచ్ వేశారు. నేషనల్ వైడ్‌గా ఎదిగేస్తున్న రష్మికకు ఇలాంటి నెగెటివిటీ పెరగడం సహజం. దీనిని దీటుగా ఎదుర్కోగల సమర్థత ఆమెకు ఉందని కితాబు నిచ్చేశారు.
![]() |
![]() |