![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని లో హీరోగా ఎంత ప్రతిభ ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎంత కామెడీ సీన్స్ చేస్తున్నా కూడా అదే సమయంలో గుండెల్ని పిండేసే ఎమోషన్ టచ్ ను కూడా ఆయన ఇవ్వగలరు. ఆయన అన్ని వేరియేషన్లలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగలరు. నవ్విస్తూ ఏడిపిస్తారు.. ఏడుస్తూ నవ్విస్తారు. అలాంటి సినిమాలే ఇతనికి మంచి గుర్తింపును తీసుకొని వచ్చాయి. ముఖ్యంగా ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో నాని స్పెషల్ హీరో. జెర్సీ సినిమాలో ఆయన తన స్థాయి నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఆ సినిమా అనుకున్నంత కమర్షియల్ సక్సెస్ కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మంచి గుర్తింపుని తీసుకొని వచ్చింది. ఇందులో నాని ఒక అబ్బాయికి తండ్రి పాత్రలో కనిపించిన విధానం హైలెట్ అయింది. ఇప్పుడు నాని తన 30వ సినిమాలో ఒక పాపకు తండ్రిగా కనిపించబోతున్నారు. జెర్సీ సినిమాలో తండ్రిగా ఒకసారి గుండెను పిండేసేలా చేసిన నాని ఈసారి కూడా చాలా ఎమోషనల్ గా ఆకట్టుకోబోతున్నట్టు అర్థం అవుతుంది.
నాని 30వ సినిమాకు కొత్తడైరెక్టర్ శౌర్యవు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఒక పాపకు తండ్రిగా నాని ఒక క్యూట్ వీడియోతో న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఇచ్చిన అప్డేట్ ద్వారా దీనిపై క్లారిటీ వచ్చింది. మరోవైపు నాని దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ మూవీకి కొనసాగింపుగా హిట్-3 అనే మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ర్ విషయంలో దర్శకుడు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడైన శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్‌కి శిష్యుడు కావడం విశేషం. నాని కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది. దసరాతో పాటు నాని 30వ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తిచేసి రెండు సినిమాలను ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని నాని అనుకుంటున్నారు. ఇక హిట్3తో పాటు నాని త్వరలో మరొక రెండు ప్రాజెక్టుల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
![]() |
![]() |