![]() |
![]() |

క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ ఆయన భార్య రమ్యకృష్ణ విడాకులు తీసుకున్నారు అంటూ గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. విడాకులు తీసుకున్న కారణంగానే రమ్యకృష్ణ చెన్నైలో ఉంటున్నారు. కృష్ణవంశీ హైదరాబాదులో ఉంటున్నారు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కృష్ణవంశీ గత కొంతకాలంగా రంగమార్తాండ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఆయన తన విడాకులు గురించి స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. రమ్యకృష్ణ నుండి నేను విడిపోయాను అని వస్తున్న వార్తలు నిజం కాదు. అలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నవారు నిజంగా పెద్ద శాడిస్టులు. అలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్న వారిని చూస్తే పాపమనిపిస్తుంది. పుకార్లను ప్రచారం చేసే వారిపై జాలి కలుగుతుంది అని అన్నారు.
రంగమార్తాండ సినీ పనులతో బిజీగా ఉన్న కారణంగానే కృష్ణవంశీ పూర్తిగా హైదరాబాదులో ఉండాల్సి వస్తుంది. ఇక రమ్యకృష్ణ, కృష్ణవంశీ రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటారు. కలిసి వర్క్ కూడా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా ఈ విడాకుల పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి....! కాగా రంగమార్తాండ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి పలువులు నటులు నటిస్తున్నారు.
నటసమ్రాట్ అనే మరాఠీ చిత్రానికి ఈ సినిమా రీమేక్ గా రూపొందుతోంది. ఇక తాజాగా కృష్ణవంశీ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం కూడా వైరల్ అవుతోంది. కృష్ణ వంశీ విషయానికి వస్తే ఈయన గులాబీ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించి రివార్డులను,అవార్డులను కూడా సాధించింది.దీని తర్వాత ఆయన నిన్నే పెళ్లాడుతా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తీశారు. ఇందులో ఏకంగా నాగార్జున- టబూ నటించారు. ఇక ఈయన మూడో చిత్రం విషయానికొస్తే ఈయన సొంతంగా ఆంధ్ర టాకీస్ నిర్మాణ సంస్థ నెలకొల్పి నక్సలైట్లు, పోలీసుల మధ్య జరిగే భావోద్వేగాలను సింధూరం అనే చిత్రంలో చూపించారు.
ఇది అత్యద్భుతమైన చిత్రం. కమర్షియల్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం ద్వారానే బ్రహ్మాజీ హీరోగా పరిచయమైతే రవితేజ సపోర్టింగ్ హీరోగా మెప్పించి తన కెరీర్ కు బాటలు వేసుకున్నాడు. సంఘవి హీరోయిన్‌గా నటించింది. ఇటీవల టాలీవుడ్ లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఆయా హీరోల పుట్టినరోజుల్లో పాత సినిమాలను హై క్వాలిటీ తో మరోసారి థియేటర్లో విడుదల చేస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ నటించిన ఖుషి చిత్రం కూడా రీరిలీజ్‌లో తన సత్తా చాటింది. త్వరలో తొలిప్రేమ చిత్రాన్ని రీరిలీజ్ ప్రకటించారు.
కృష్ణవంశీని సింధూరం సినిమాను రీరిలీజ్ చేయాలని ఓ నెటిజన్ కోరారు. ఈ చిత్రాన్ని మళ్లీ చూడాలని ఉంది అంటూ సార్ ఒక్కసారి సింధూరం సినిమాను రిలీజ్ చేయండి. నాలాంటి వాళ్ళు చాలామంది చూడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నామని ట్విట్ చేశారు. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ అమ్మో ఐదు సంవత్సరాలు అప్పులు కట్టానయ్యా... వామ్మో.... అంటు దండం పెట్టేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొందరేమో ఇది సాదా సీదా సినిమా కాదు అని అంటే మరి కొందరు ఇప్పుడు రిలీజ్ చెయ్యండి... ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు...!
![]() |
![]() |