![]() |
![]() |

ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో మెప్పించిన బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్. ఈమె ఎంతో ఆధునిక భావాలు కలిగిన యువతి. ఈమె తండ్రి మహేష్ భట్ కూడా అదే తరహాలో ఉంటారు. ఇక అలియాభట్ గత రెండు మూడేళ్ల కాలంలోనే తన స్టార్ ఇమేజ్ ని అమాంతంగా పెంచేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఈమె ఒకరు. కానీ ఈమె తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని తల్లి కూడా అయి షాకిచ్చింది.
తాజాగా అలియా భట్ మాట్లాడుతూ తల్లి కావడం అనేది ఒక్క గొప్ప అదృష్టం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని నేను తొందరగా పొందాను. చాలా సంతోషంగా ఉంది. ఇక ఇంత స్టార్ హోదా ఉన్న సమయంలో త్వరగా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాను. తల్లి అయితే స్టార్ హోదా పోతుంది అనేది నేను ఎంత మాత్రం నమ్మను. మన వ్యక్తిగత జీవితానికి, సినిమా జీవితానికి ఏ సంబంధం లేదు. ఒకవేళ అలాంటి సంబంధమే ఉన్నా కూడా తల్లి కావడానికి వాటి వేటిని నేను పట్టించుకోను. ఎందుకంటే ఇది నేను ఎంతో ఇష్టంగా అనుకున్న ఒక మంచి తరుణం.
మా ఫ్యామిలీ లైఫ్ లో మరొక మెంబర్ చేరారు అంటే మాకు ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి ఆనందాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. సినిమా కెరీర్ గురించి ఏమాత్రం టెన్షన్ పెట్టుకోలేదు అని చెప్పుకొచ్చింది. పలువురు ఇటీవల ఈమె పై కొన్ని ఆరోపణలు చేశారు. పెళ్లయిన అతి కొద్ది నెలలకే ఈమె తల్లి కావడంతో పెళ్లికి ముందే ఈమె ప్రెగ్నెంట్ అని ప్రచారం జరిగింది. దానిపై కూడా అలియా భట్ స్పందించింది. అవును నేను హాలీవుడ్ సినిమాలో నటించేనాటికే ప్రెగ్నెంట్ ను. బేబీ బంప్ తో హాలీవుడ్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో పాల్గోన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. విషయం తెలుసుకున్న యూనిట్ వారు అక్కడ నాకెంతో సహకారం అందించారు. 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న నేను నవంబర్ లోనే బిడ్డకు జన్మనిచ్చాను.
పెళ్లయిన కొన్ని నెలలకే నేను జన్మనివ్వడం అందరికీ ఎన్నో సందేహాలను కలిగించింది.... అంటూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి పాతకాలంలో పెళ్లికి ముందే తల్లి అయింది అంటే వారిని సమాజం నుండి వెలివేసేవారు. కానీ రాను రాను పరిస్థితి మారుతుంది.ఇప్పుడు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
గతంలో దివంగత ఎవర్గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి బోనీకపూర్ తో పెళ్లికి ముందే తల్లి కావడంతో హడావుడిగా పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇటీవల అమీ జాక్సన్, నేహా దుపియా వంటి వారు కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ విషయం చాలామందికి తెలిసిందే. మొత్తానికి అలియా భట్ ఇలా ఓపెన్ గా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ను అని చెప్పడం ఆమె గట్స్‌కి నిదర్శనం. ఇలా ఒప్పుకున్నందుకు ఆమెను అభినందించి తీరాలి. అయితే ఈ ప్రభావం సమాజంలో మిగతా వారిపై తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే ఆమె సినీ నటి కాబట్టి సమాజంలో చాలామంది పై ఆమె వ్యక్తిగత జీవిత ప్రభావం కూడా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |