![]() |
![]() |

దక్షిణాది చిత్రాలలో, తెలుగు సినిమాలలో అవకాశం ఉన్నంతవరకు ఉత్తరాది భామలు ఇక్కడి వారిపై ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఒక్కసారి బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత వారికి సౌత్ ఇండస్ట్రీపై అభిప్రాయాలు మారుతుంటాయి. సౌత్ సినిమాలను చిన్నచూపు చూస్తూ ఉంటారు. అనవసర అపవాదులు వేస్తూ ఉంటారు. ప్లేట్లు ఫిరాయిస్తుంటారు. ఆవేశంలో నోరు జారి అడ్డంగా బుక్ అవుతుంటారు. గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి కొన్నేళ్ళకి తెలుగు ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేసింది. 'దేవదాస్' చిత్రంలో నటిస్తున్న సమయంలో దర్శకుడు తనపై కామెంట్ చేశాడని ఆరోపించింది.
తన నడుం పై ఏదో పడిందని, అది చాలా ఆనందంగా ఉందని దర్శకుడు కామెంట్లు చేసినట్లు తెలిపింది. ఇంకా సౌత్ లో చాలామంది దర్శకులు తన నడుము పైనే దృష్టి పెట్టారని ఆరోపించింది. నడుము అందం ఉందని కామెంట్ చేయడం, పదే పదే అలా ఎందుకు కామెంట్లు చేస్తున్నారో మొదట తనకు అర్థమయ్యేది కాదని ఇలియానా ఆరోపించింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నంతకాలం ఈమె ఈ రకమైన కామెంట్లు ఏనాడు చేయలేదు.
ఇక బాలీవుడ్లో బిజీ అవుతున్న మరో నటి రకుల్ ప్రీత్ సింగ్. నిన్న మొన్నటి వరకు తెలుగును పట్టుకొని వేలాడిన ఈమె బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత సౌత్ ఇండస్ట్రీ తనను చిన్నచూపు చూసిందని ఆరోపించింది. పాన్ ఇండియా చిత్రాల్లో కేవలం కొంతమందికే పని కట్టుకొని దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తున్నారని, అక్కడ ఈ విధానం మారాలంటూ ఆరోపించింది. హైదరాబాదు నుంచి ముంబైకి మకాం మార్చిన తర్వాత ముంబై ఫ్లాట్‌లో కూర్చొని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అలాగే రాశి ఖన్నా కూడా ఇదే తరహాలో హీరోయిన్లను తొక్కేస్తున్నారని ఆరోపించింది. సౌత్ వాళ్లకు బొద్దుగా ఉన్న వాళ్లంటే ఇష్టం. అలాంటి వాళ్ళకే అవకాశాలు కల్పిస్తారు. తెలుగులో టాలెంట్‌ని పట్టించుకోరంటూ సంచల వ్యాఖ్యలు చేసింది. అయితే ఈమె బాలీవుడ్‌కి వెళ్లకుండానే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
బాలీవుడ్లో బిజీ అవుతున్న కన్నడ భామ రష్మిక మందన్న కూడా ఇటీవల సొంత పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో సొంత పరిశ్రమని మర్చిపోయి ఇష్టారీతిన మాట్లాడుతున్న రష్మిక మందన్నను కన్నడ పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని నిర్మాతలు అంతా నిప్పులు చెరిగారు. ఆ తర్వాత రష్మిక వివరణ ఇవ్వడంతో వాతావరణం చల్లబడింది. ముంబైకి మకాం మార్చిన తర్వాత ఇక్కడ లోపాలను ఎత్తి మరీ గ్లోరిఫై చేయడం ప్రారంభించింది. మొత్తానికి ఈ భామలను నెత్తిన పెట్టుకొని ఆదరించినందుకు తెలుగు సినీ పరిశ్రమ మేకర్స్, ప్రేక్షకులని తప్పుపట్టాల్సిందే గాని వాళ్లను తప్పు పట్టి లాభం లేదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన తెలుగువారిపైనే ఫోకస్ చేయాలని, తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
![]() |
![]() |