![]() |
![]() |

మెగా మూవీ 'వాల్తేరు వీరయ్య' ఈ సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండగా మరో కీలకపాత్రను కేథరిన్ థ్రెసా కూడా పోషిస్తున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. కేథరిన్ పాత్ర రవితేజ పాత్రకు జోడి అయ్యి ఉంటుందని కథనాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు కేథరిన్‌కి సంబంధించిన ఫోటో గాని విజువల్ గాని ప్రమోషన్స్ సందర్భంగా రివీల్ చేయలేదు. అసలు కేథరిన్ పాత్రను ఉంచారా? లేదంటే లేపేసారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి 'ఆచార్య' సినిమాలో కాజల్ అగర్వాల్ నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు.
ఇప్పుడు రవితేజ పరిధి ఎక్కువగా ఉండటం వలన కేథరిన్ పాత్రను తొలగించి ఉంటారా? అనే సందేహం కలుగుతుంది. కేథరిన్ పాత్ర చిన్నది అయినా ఆమెకున్న క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి ప్రమోషన్ ఈవెంట్స్ లో ప్రాధాన్యం ఇస్తారని అందరూ భావించారు. ఇలాంటి హీరోయిన్లను పెట్టుకునేదే అందుకు. వారి వలన లాభం ఏమైనా ఉందా? అంటే సినిమాలో గ్లామర్ పరంగా లోటులేదని ప్రేక్షకులకు తెలిపేందుకే.
ఇక చిరు చిత్రం అంటే అందులో రవితేజకు స్పెషల్ డ్యూయెట్లను ఎలాగూ ఊహించలేం. చిరుకి ఎన్ని పాటలు ఉన్నా ఇంకా ఉంటే బాగుండునని ప్రేక్షకులు భావించడం సహజం. దాంతో రవితేజకు చిరుతో కలిపి అయితే ఓ పాట ఉంటుంది గానీ స్పెషల్ సాంగ్స్ ఉండే అవకాశమే లేదు.
ఈవెంట్స్ లో లేదా పోస్టర్స్ లో కేథరిన్ ఉండి ఉంటే యూత్‌కి మరింత ఊపు వచ్చి ఉండేది. ఫేడవుట్ అయిన శ్రుతి హాసన్ గ్లామర్ కంటే కేథరిన్ గ్లామర్‌కే ఎక్కువ ఓట్లు పడతాయి. కానీ ఇప్పటివరకు ఆమెను ఒక్కసారి కూడా ప్రమోషన్స్‌లో చూపించలేదు. పాటల్లో కేథరిన్‌కు చాన్స్ ఇవ్వలేదు. దాంతో సినిమాలో ఆమె పాత్ర ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ పాటల్లో కూడా ఇక కనిపించకుండా ఉంటే ఇక సినిమాలో ఆమె రోల్ చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆమె పాత్రను తొలగించే అవకాశం కూడా ఉందని కొందరు భావిస్తున్నారు...!
![]() |
![]() |