![]() |
![]() |

తెలుగు నిర్మాతల మండలి గొడవలకు వేదికగా మారింది. పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా సి.కళ్యాణ్ అధ్యక్షుడిగా కొనసాగుంతుండటాన్ని పలువురు సభ్యులు వ్యక్తిరేకిస్తున్నారు. తాజాగా ఈ విషయమై చర్చలు జరగగా.. అది మరో గొడవకి దారి తీసింది. ఒక సభ్యుడికి, సి.కళ్యాణ్ కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో సభ్యులు సి.కళ్యాణ్ తో చర్చిస్తుండగా.. అందులో ఒక సభ్యుడు ఆ మీటింగ్ ని ఫోన్ లో చిత్రీకరించడం మొదలు పెట్టారు. ఇది గమనించిన కళ్యాణ్ "ఎవరయ్యా నువ్వు.. మా మెంబెర్స్ తో మేం మాట్లాడుకుంటుంటే ఎందుకు వీడియో తీస్తున్నావ్?.. నీకు పనిపాట లేకపోతే వేరే ఏదైనా తీసుకో" అంటూ మండిపడ్డారు. "నా పేరు రవిచంద్.. నేనూ మెంబెర్ నే" అని సభ్యుడు సమాధానం ఇవ్వగా.. "అసలు నిన్ను ఎప్పుడో పంపించేసి ఉండాలి.. బయటకు వెళ్ళిపో" అంటూ కళ్యాణ్ మళ్ళీ ఫైర్ అయ్యారు. "నన్ను బయటకు వెళ్ళమనడానికి మీరెవరు?.. నేను మెంబెర్ ని, ఇక్కడ ఉండే రైట్ ఉంది" అని రవిచంద్ బదులిచ్చారు. దాంతో మరింత రెచ్చిపోయిన కళ్యాణ్ "నువ్వు పనికిరాని మెంబెర్ వి" అంటూ సీరియస్ అవ్వగా.. "నువ్వే పనికిరాని ప్రెసిడెంట్ వి" అంటూ రవిచంద్ కూడా విరుచుకుపడ్డారు. అలా ఇద్దరి మధ్య మాట మాట పెరగగా.. మిగతా సభ్యులు కలుగజేసుకొని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ గొడవకు సంబంధించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |