![]() |
![]() |

కిందటి ఏడాది అంటే 2022 లో ఐరన్ లెగ్ ఆఫ్ ది హీరోయిన్ అంటే పూజా హెగ్డే పేరు చెప్పుకోవాలి. ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ లాంటి చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. గత ఏడాదంతా బ్యాడ్ టైం ఈ అమ్మడిని ఫుట్‌బాల్ ఆడేసింది. మరీ ముఖ్యంగా రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సర్కస్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఫ్లాప్ తో తనకేమీ సంబంధం లేనట్టు కవరింగ్ ఇస్తోంది పూజ హెగ్డే. నిజానికి సర్కస్ చిత్రం ముందు రోహిత్ శెట్టికి అపజేయమనేదే పెద్దగా ఎరుగడు. అలాంటి అపజయాలు ఎరుగని దర్శకునితో డిజాస్టర్ ఇచ్చిన ఘనత పూజా హెగ్డేకి దక్కుతుంది. తాజాగా పూజ మాట్లాడుతూ ఈ సినిమా కేవలం రోహిత్ శెట్టి కోసమే చేశాను. అందరిలాగే నాకు కొందరు దర్శకులతో పని చేయాలని ఉంటుంది. అలాంటి వాళ్లలో రోహిత్ శెట్టి పేరు ముందుంటుంది. ఆయన ఫోన్ చేసి సినిమాలో నటించాలని కోరగా మరో మాట లేకుండా ఓకే చెప్పాను.
ఆయన ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా. కానీ కాల్ అటెండ్ చేయలేదు. అప్పుడు ఏదో పనిలో ఉన్నాను. అమ్మ పదేపదే విషయం చెప్పి తిరిగి కాల్ చేయమంది. దీంతో నేను ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఆయనకు ఫోన్ చేశాను. ఆయన గొంతు వినగానే కేకలు వేసినట్టు ఆనందంతో మాట్లాడాను. ఆయన డేట్స్ ఉన్నాయా? అని అడిగారు. లేకపోతే సర్దుబాటు చేసుకుంటాను సార్ అని చెప్పాను. ముందు హీరో ఎవరో అతను చెప్పలేదు. నేను అడగలేదు. అతని సినిమాలో నటించాలనుకున్నప్పుడు హీరోతో పనేముంది? అన్నది నా ఉద్దేశం. అందుకే అడగలేదు. చివరలో రణవీర్ సింగ్ పేరు చెప్పారు అని సర్కస్ ఫ్లాప్ ని తన మీద వేసుకోకుండా ఆ బాధ్యతనంత దర్శకుడు మీదనే తోసేస్తోంది. మరోవైపు రణవీర్ సింగ్ ను కూడా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే నెగటివ్ ప్రచారం ఎక్కువైన నేపథ్యంలో ఐరన్ ఐరన్ లెగ్ ముద్ర వేస్తారని భయంతోనే పూజ ఇలా ప్లాన్ చేసి తెలివిగా ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తోంది అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన కిసికా బాయ్ కిసీక జాన్ సినిమాలో నటిస్తోంది.
![]() |
![]() |