![]() |
![]() |
.webp)
ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో నటసింహం బాలకృష్ణ, 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. జనవరి 12న 'వీరసింహారెడ్డి', జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏది ఎక్కువ ఓపెనింగ్స్ రాబడుతుంది? ఫైనల్ గా ఏది పైచేయి సాధిస్తుంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఓవరాల్ గా ఏమో గానీ.. ప్రస్తుతానికి యూఎస్ ప్రీ సేల్స్ లో మాత్రం 'వీరసింహారెడ్డి'దే పైచేయి కనిపిస్తోంది.
యూఎస్ లో జనవరి 11 నుంచి 'వీరసింహారెడ్డి' ప్రీమియర్స్, జనవరి 12 నుంచి 'వాల్తేరు వీరయ్య' ప్రీమియర్స్ ఉంటాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు సినిమాల బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే 'వాల్తేరు వీరయ్య'తో పోల్చితే చూస్తే 'వీరసింహారెడ్డి' కాస్త మెరుగ్గా ఉంది. యూఎస్ లో ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటిదాకా 'వాల్తేరు వీరయ్య'కు లక్షా యాభై వేల డాలర్లకు పైగా($150k+) రాగా.. 'వీరసింహారెడ్డి'కి లక్షా యాభై వేల డాలర్లకు పైగా($175k+) రావడం విశేషం. 'వాల్తేరు వీరయ్య' కంటే ఒకరోజు ముందుగా విడుదలవుతుండటం వల్ల.. 'వీరసింహారెడ్డి' ప్రీ సేల్ కలెక్షన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఫైనల్ గా ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో చూడాలి.
![]() |
![]() |