![]() |
![]() |

ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి, 'వీర సింహా రెడ్డి'తో నటసింహం బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 2017 సంక్రాంతికి కూడా 'ఖైదీ నెం.150'తో చిరంజీవి, 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బాలకృష్ణ తలపడగా రెండు చిత్రాలూ విజయాన్ని సాధించాయి. అంతేకాదు ఆ సంక్రాంతికి శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' కూడా విడుదలై అంచనాలకు మించిన విజయాన్ని అందుకొని సత్తా చాటింది. ఈ సంక్రాంతికి కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో అనిపిస్తోంది.
జనవరి 12న 'వీర సింహా రెడ్డి', జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' విడుదలవుతుండగా.. జనవరి 14న 'కళ్యాణం కమనీయం' రానుంది. తాజాగా విడుదలైన 'కళ్యాణం కమనీయం' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. జాబ్ చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని, దర్జాగా కూర్చొని తినొచ్చని హీరో అనుకుంటే.. చివరికి జాబ్ చేయాల్సిన పరిస్థితి రావడం ఆసక్తికరంగా ఉంది. ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఎమోషన్స్ కలయికతో రూపొందిన ఈ చిత్రం.. సంక్రాంతికి సర్ ప్రైజ్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.
సంతోష్ శోభన్, ప్రియ భవాని శంకర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ నిర్మించడంతో పాటు.. నైజాం, వైజాగ్ లో దిల్ రాజు విడుదల చేస్తుండటం విశేషం. 2017లో 'శతమానం భవతి' చేసిన మ్యాజిక్ ని.. ఈ సంక్రాంతికి 'కళ్యాణం కమనీయం' రిపీట్ చేస్తుందో లేదో అనేది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.
![]() |
![]() |