![]() |
![]() |

అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే 'పుష్ప'కి ముందు 'పుష్ప'కి తర్వాత అంటూ విభజించుకోవాల్సి వస్తుందేమో. ఆయన 'ఆర్య' నుండి 'దేశముదురు', 'జులాయి', 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు', 'అల వైకుంఠపురములో' వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ఆయన ఇమేజ్ ని అమాంతంగా మార్చేసిన చిత్రాలు అంటే 'ఆర్య' తర్వాత 'పుష్ప-ది రైజ్'ను చెప్పుకోవాలి. పుష్ఫ- ది రైజ్ ద్వారా ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి రేంజ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
'పుష్ప2'ను వెంటనే మొదలుపెట్టాలి అనుకున్నప్పటికీ స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువగా వర్కౌట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ కాబట్టి 'పుష్ప 1'కు మించి ఉండాలి అనే ఉద్దేశంతో 'పుష్ప2' స్క్రిప్ట్ పై దాదాపు ఏడాది పాటు వర్క్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకు 400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ కు పారితోషకంగా 100 కోట్లు ఉంటుందట. దర్శకుడు సుకుమార్ కు 30 కోట్లు ఉందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమా విడుదల అయిన తర్వాత పెట్టిన బడ్జెట్ మొత్తం తిరిగి రాగా మిగిలిన లాభాల్లో 40 శాతం మాత్రమే తీసుకుంటారట. మిగిలిన 60 శాతంలో అల్లు అర్జున్ కి 30 శాతం, సుకుమారుకు 30 శాతం పంచనున్నారని సమాచారం.
అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఏడాదిగా కష్టపడుతున్నారు. మరో ఏడాది ఆయన ఇదే సినిమాకు కమిట్ అయి ఉన్నారు. మరే సినిమాలు ఒప్పుకోవడం లేదు. దాంతో మిగిలిన చిత్రాలను పట్టించుకోకుండా కేవలం పుష్ప కోసమే తన ఇంత విలువైన సమయాన్ని కేటాయించడం వల్ల 100 కోట్ల పారితోషం అనేది సమంజసమే అని చాలామంది అభిప్రాయం. అల్లు అర్జున్ కష్టానికి ఇది సమంజసమేనని అంటున్నారు. పుష్ప 2 కనుక సక్సెస్ అయ్యి అటు ఇటుగా 100 కోట్ల లాభం వస్తే బన్నీకి 30 కోట్లు అదనంగా వస్తాయి. అంటే ముందుగా ఇచ్చిన 100 కోట్లతో పాటు ఈ 30 కోట్లు అదనం అవుతుంది. కనుక సినిమా మినిమంగా ఆడిన కూడా 100 కోట్ల లాభాలు వస్తాయి. అంతకుమించి ఆడితే బన్నీ ఇక ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు. ప్రస్తుతానికైతే ఈ లెక్కను చూసుకుంటే అల్లు అర్జున్ ఇండియాలో అత్యధిక పారితోషం తీసుకుంటున్న నెంబర్ వన్ హీరో అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |