![]() |
![]() |

హీరోయిన్‌ల కెరీర్ చాలా తక్కువ వ్యవధిలో ముగుస్తూ ఉంటాయి. ఎవరో అదృష్టం కొద్దీ ఒకటి రెండు దశాబ్దాలు ఉంటారు. కానీ మిగిలిన వారికి అది చాలా కష్టం. నయనతార, అనుష్క, తమన్నా, కాజల్ వంటి వారు దీనికి మినహాయింపుగా కనిపిస్తారు. ఇక హీరోయిన్లకు కెరీర్ లో ఎప్పుడు ఎలాంటి చాన్సులు వస్తాయో చెప్పడం కష్టం. కమల్ గారాల పట్టి శృతిహాసన్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.
సీనియర్ హీరోలు చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో సలార్ మూవీలో కూడా జతకట్టింది. సాధారణంగా యంగ్ హీరోయిన్‌లు సీనియర్ హీరోలతో జోడి కట్టేందుకు బాగా ఆలోచిస్తారు. కానీ శృతి మాత్రం నిజ జీవితం వయసుతో సంబంధం లేదని అదొక నెంబర్ మాత్రమేనని అంటోంది. తనకంటే ముందు పలువురు ఇలా తమకు రెండు రెట్ల వయసున్న హీరోలతో కలిసి నటించారని, తానేమీ కొత్త కాదని అంటుంది.
తాను కేవలం డబ్బు కోసం సీనియర్ల సరసన సినిమా చేయడం లేదని, ఆఫర్ల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని... హీరోయిన్ అన్న తర్వాత అందరితో కలిసి నటించినప్పుడే బాగుంటుందని వ్యాఖ్యానించింది. ఇలా శృతిహాసన్ కి తెలుగులో ఒకేసారి ఫ్యాన్సీ ఆఫర్స్ రావడం ఆమె ఫ్యాన్స్ కూడా ఆనందం కలుగజేసింది. చిరు, బాలయ్యలతో సరే ఏకంగా యంగ్ రెబెల్ స్టార్...పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ లో చాన్స్ రావడం మాత్రం చాలా మందికి షాకిచ్చింది.
ఇక విషయానికి వస్తే మాస్ మహారాజా రవితేజ కెరీర్‌ను మరలా ట్రాక్‌లో పెట్టిన చిత్రం క్రాక్. ఇందులో రవితేజకి ఆమె భార్యగా నటించింది. ఈ చిత్రం రవితేజకే కాదు.. శృతిహాసనన్ కెరీర్ ని సైతం గాడిలో పెట్టింది. అంతకు ముందు ఆమె రవితేజ నటించిన బలుపు చిత్రంలో ప్రేయసిగా యాక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్యలో శృతిహాసన్ రవితేజ కి వదిన పాత్రలో కనిపిస్తుందట.
చిరంజీవి రవితేజ అన్నయ్య పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. సో....అలా చూస్తే శృతిహాసన్ రవితేజ కి వదిన పాత్ర చేస్తున్నట్టు లెక్క. హీరోయిన్ కెరీర్ లో సోలో చాన్స్ రాకపోతే వారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సి వస్తుంది. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే శృతిహాసన్ ఇలా రవితేజకు వదినగా నటించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
మధ్యలో ప్రేమ దోమ అంటూ... సహజీవనం అంటూ తన కెరీర్ ని తానే చేజేతులా నాశనం చేసుకుంది. అందువల్లనే ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు ఫేడ్ అవుట్ అయిందని దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తుందని అంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్యలో రవితేజ సరసన కేథరిన్ త్రెసా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా ఈ ఏడాది శృతిహాసన్ నుంచి వచ్చే ఈ మూడు చిత్రాలు తప్పకుండా శృతిహాసన్ మైలేజీని పెంచేవిగా ఉంటాయని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు...!
![]() |
![]() |