![]() |
![]() |

బాలయ్య బాబు అభిమానులను అప్పుడప్పుడు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పలుసార్లు అభిమానంతో తనకు దగ్గరగా వచ్చిన వారిని బాలయ్య నెట్టివేయడం, కొట్టడం, వారి చేతిలో ఫోన్ లాక్కోవడం వంటివి చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి ఈ విషయమై బాలయ్య స్పందిస్తూ నా చేతిలో దెబ్బతిన్న అభిమానులు బాధపడరు... ఆనందపడతారు... నా చేయి తమ శరీరాన్ని తాకినందుకు వారు సంతోషిస్తారు అని చెప్పుకొచ్చారు. తాజాగా రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలయ్యను నేను కూడా ఈ విషయమై ప్రశ్నించాను. అప్పుడు బాలయ్య నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది అని సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు. ఇతర హీరోలు బయటకు వెళ్లిన సమయంలో బౌన్సర్లను పెట్టుకుంటారు. కానీ నాకు వారు అక్కర్లేదు. డబ్బులు ఇచ్చి అభిమానులను కొట్టించడం నాకు నచ్చదు.. బౌన్సర్లను పెట్టుకున్నామంటే డబ్బులు ఇచ్చి అభిమానులను కొట్టించడానికే అని నా అభిప్రాయం. అందుకే అభిమానులు నాకు మధ్య వారు వద్దని భావిస్తాను. నా ఫ్యాన్స్ ని కొట్టేందుకు బౌన్సర్లు ఎవరు? కొడితే వారిని నేనే కొట్టాలి. ఒకవేళ అభిమానులను నేను కొట్టిన సందర్భంలో వారు బాధపడితే వారితో నేను మళ్ళీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డీల్ చేసుకుంటాను అన్నట్లుగా బాలయ్య చెప్పాడట. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా వారిలో బాలయ్య చాలా స్పెషల్. ఆయన అభిమానులకు అంతకుమించి స్పెషల్. ఇది నిజమే అన్నట్లుగా సాయి మాధవ్ బుర్ర మాటలు వింటే అనిపిస్తోంది.
![]() |
![]() |