![]() |
![]() |

రెజీనా కసాండ్రా.. స్పెషల్‌గా పరిచయం అక్కర్లేని పేరు. ఎక్కడ విమెన్ ఓరియంటెడ్ సబ్జెక్టులున్నా, అక్కడ వాలిపోతారు రెజీనా. ఇప్పుడు ముంబైలో కనిపిస్తున్నారు రెజీనా. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో 'జాన్‌బాజ్ హిందుస్తానీ కే' అనే వెబ్ సీరీస్‌లో నటిస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది ఈ వెబ్‌సీరీస్. ముఖ్యంగా యూనిఫార్మ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చేసే త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. హిందీ, తమిళ్, తెలుగులో తెరకెక్కుతోంది. మేఘాలయలోని రా లొకేషన్లలో తెరకెక్కించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు.
ఈ సిరీస్ గురించి రెజీనా మాట్లాడుతూ "రూమర్లకు చెక్ పెడుతున్నా. 'జాన్‌బాజ్ హిందుస్తానీ కీ' సీరీస్‌లో నటిస్తున్నా. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. గత మూడు నెలలుగా ఈ సిరీస్ కోసం కష్టపడుతున్నా. నాలుగు రాష్ట్రాల్లో రాగా ఈ సీరీస్‌ని తెరకెక్కించాం. ఐపీయస్ ఆఫీసర్ యూనిఫార్మ్ వేసుకుంటే, ఆ ఫీలింగ్ మరో లెవల్లో అనిపించింది. ఇన్నేళ్లల్లో నేను చేసిన పాత్రల్లోకెల్లా పవర్‌ఫుల్ రోల్ ఇది. ఆఫీసర్లు చాలా హ్యాట్స్ పెట్టుకుంటారు. 'జాన్‌బాజ్ హిందుస్తానీ' వాళ్ల కీర్తికిరీటంలో తప్పక చేరుతుంది. నన్ను నేను ఖాకీ యూనిఫార్మ్ లో చూసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది" అని అన్నారు.
శ్రీజిత్ ముఖర్జీ రీసెంట్‌గా స్పోర్ట్స్ బయోపిక్ 'శభాష్ మిథు' చేశారు. అందులో తాప్సీ లీడ్ రోల్‌లో నటించారు. ఇండియన్ క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌గా తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా, ప్రేక్షకుల మెప్పు మాత్రం పొందింది 'మిథు' మూవీ.
![]() |
![]() |