![]() |
![]() |

2024లో జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? ఇస్తే బావుంటుందనే ఆకాంక్ష మాత్రం సర్వత్రా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమాలో జాన్వీ పేరు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. దీని గురించి అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే జాన్వీ మాత్రం తెగ సంబరాల్లో మునిగితేలుతున్నారు. రీసెంట్‌గా ఆమె నటించిన సినిమా 'మిలి'. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఆమె నటన, నేషనల్ వైడ్ అటెన్షన్ తెచ్చుకుంది. ఇన్నాళ్లూ ఆస్వాదించిన జాన్వీ ఇప్పుడు స్పందించారు.
"మిలికి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 'మిలి' సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంతకు మించి భగవంతుడిని ఏమీ అడగదలచుకోలేదు" అని అన్నారు. తన తండ్రి బోనీకపూర్ నిర్మాణంలో జాన్వీ కపూర్ నటించిన తొలి సినిమా 'మిలి'. మధుకుట్టి జోవియర్ తెరకెక్కించారు. సన్నీ కౌశల్, మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. సర్వైవర్ థ్రిల్లర్ కేటగిరీకి చెందిన సినిమా ఇది.
2019లో మలయాళంలో విడుదలైన 'హెలెన్'ని 'మిలి' పేరుతో రీమేక్ చేశారు. జాన్వీ ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో 'బావల్'లో నటిస్తున్నారు. వరుణ్ ధావన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న విడుదల కానుంది 'బావల్'. స్పోర్ట్స్ డ్రామా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి'లోనూ కీ రోల్ చేస్తున్నారు జాన్వీ. ఇందులో రాజ్‌కుమార్ రావ్ సరసన నటిస్తున్నారు జాన్వీ.
![]() |
![]() |