![]() |
![]() |

ఒకరికి ఒకరు నచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత సాగించే జర్నీ చాలా కీలకం. బ్యూటీఫుల్ కపుల్‌గా సొసైటీ చేత శభాష్ అనిపించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఒకరికి ఒకరై ఉంటూ ఇప్పటికే ఈ విషయంలో గెలిచి చూపించారు సూర్య అండ్ జ్యోతిక. సౌత్‌లో వీరిద్దరినీ క్యూట్ కపుల్ అంటూ పొగుడుతుంటారు. తెలుగులో మహేష్ - నమ్రత మధ్య ఉన్న అన్యోన్యతను కూడా చాలా మంది ఎగ్జాంపుల్‌గా చూపిస్తుంటారు. ఇప్పుడు ఇదే రూట్లో నార్త్ నుంచి జెనీలియా ట్రావెల్ చేస్తున్నారు.
బొమ్మరిల్లు హాసినిగా మనకు బాగా పరిచయమైన జెనీలియా వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారు జనాలు. జెనీలియా - రితీష్ మ్యూచువల్ సపోర్ట్ మీద ఫోకస్ పెరుగుతోంది. రీసెంట్ గా వేద్ మూవీతో డైరక్టర్‌గా మారారు రితీష్. జెనీలియా ఇందులో కీ రోల్ చేశారు. సినిమా విడుదలైన డిసెంబర్ 30 నుంచి మరాఠా సర్కిల్స్ లో ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి.
జెనీలియా, రితీష్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ కి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. లాయ్ భారీ సినిమాతో 2014లో తొలిసారి తెరమీద కలిసి కనిపించారు ఈ జోడీ. చాలా మంది రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. అప్పటికీ, ఇప్పటికీ సేమ్ గ్రేస్ మెయింటెయిన్ చేస్తున్నారు ఈ కపుల్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఓ పాటలో నటించారు.తెలుగులో గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే అందరూ అత్యంత గొప్పగా చెప్పుకున్నారు. కానీ మరాఠీ వేడ్ విషయంలో సల్మాన్ చరిష్మాను మించిపోయింది రితీష్ - జెనీలియా జోడీకున్న క్రేజ్. సినిమాల సెలబ్రిటీలుగా, నటులుగా సూర్య అండ్ జ్యోతికను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు జెనీలియా రితీష్ అంటున్నారు నెటిజన్లు. తెలుగులోనూ రామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు జెనీలియా. రామ్ - జెనీలియా కలిసి చేసిన రెడీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలోఅవుతుంటారు.
![]() |
![]() |