![]() |
![]() |

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. 'బాహుబలి'తో ఆయన తన స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కి పెంచుకున్నారు. ఆ తర్వాత తన సినిమాలన్నింటిని నేషనల్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆయనతో చిత్రం చేయడం కోసం అన్ని భాషల దర్శకులు క్యూలో ఉన్నారు. బడా బడా డైరెక్టర్లు కూడా ఆయనతో చిత్రం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ తో ఇంతమంది దర్శకులు పనిచేయాలని ఉవ్విళ్లూరుతుంటే ప్రభాస్ కి మాత్రం గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ మణిరత్నంతో పని చేయడం ఇష్టం అని అంటున్నారు. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయాలని ఆసక్తిని వ్యక్తం చేశారు.
"బాపు గారి డైరెక్షన్ అంటే నాకు ఇష్టం. బాపు గారు డైరెక్షన్ చేస్తున్నారనే నేను 'శ్రీరామ రాజ్యం' చేశాను" అని బాలకృష్ణ తన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2' ప్రభాస్ ఎపిసోడ్‌లో చెప్పారు. దాంతో పెదనాన్న 'భక్తకన్నప్ప' తీసింది కూడా బాపు గారే అన్న విషయాన్ని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. అలాగే, బాపు గారితో పాటు మణిరత్నం గారంటే ఇష్టమని, ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని ప్రభాస్ తన మనసులో మాట బయట పెట్టారు. బాపు దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎలాగూ చేయలేకపోయారు. సో తనకి ఇష్టమైన మణిరత్నం డైరెక్షన్లో అయినా సినిమా చేస్తాడేమో వేచిచూడాలి. ప్రభాస్ చేస్తాను అంటే మణిరత్నం ఆయనకు తగిన కథను సిద్ధం చేసి సినిమా చేసే అవకాశం ఉంది. ప్రభాస్-మణిరత్నం కాంబినేషన్ అంటే ఆ మూవీ వేరే లెవెల్ లో ఉంటుంది.
ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేయనున్నారు. 'బాహుబలి' వేసిన బాటలోనే మణిరత్నం కూడా ఇటీవల 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా తీసి భారీ హిట్టును కొట్టారు. వచ్చే ఏడాది 'పొన్నియన్ సెల్వన్ 2'ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ మొత్తానికి మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేయాలని ఉందన్న కోరికను బయట పెట్టారు. మణిరత్నం కూడా అందుకు ఓకే అంటే మరో భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
![]() |
![]() |