![]() |
![]() |

ఈమధ్య టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పై పలు వివాదాలు వస్తున్నాయి. పండుగలకు తెలుగు సినిమాలు విడుదలయితే ముందుగా తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు కేటాయించి ఆ తర్వాత డబ్బింగ్ చిత్రాల కేటాయించాలని నాడు కొత్త వాదన మొదలు పెట్టింది ఈయనే. అటువంటి ఈయనే ప్రస్తుతం తెలుగులో నేరుగా వస్తున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలకు పోటీగా తన డబ్బింగ్ చిత్రమైన వారసుడును తనకున్న పలుకుబడితో భారీగా థియేటర్లను కేటాయిస్తున్నారు. వీరయ్య, వీర సింహారెడ్డిలకు సరి సమానంగా కోలీవుడ్ స్టార్ విజయ్ చిత్రానికి థియేటర్లు కేటాయించేలా చేయడం అంటే అది ఎవరికైనా బాధాకరమే. దాంతో బాలయ్య, చిరు అభిమానులు దిల్ రాజుపై మండిపడుతున్నారు.
మరోవైపు ఆయన కోలీవుడ్‌తో అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్ హీరో అని స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ వివాదానికి కారణమయ్యారు. ఇక చిన్న చిన్న సినిమాలను ఈయన తొక్కేస్తాడని అపవాదు ఎప్పటినుంచో ఉంది. అది కార్తికేయ 2 పోస్ట్ పోన్ అయిన సందర్భంగా బహిర్గతమైంది. ఈయన చేసిన పనికి హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ ఒకే రోజున మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండడం వల్ల అలా చేయాల్సి వచ్చిందని, అందులో తన థాంక్యూ కూడా ఉండడంతో మిగిలిన నిర్మాతలను ఒప్పించి మాత్రమే అలా చేశానని చెప్పుకొచ్చారు. అది ఏదో రిక్వెస్ట్ చేసి క్యాన్సిల్ చేయించాను కానీ బలవంతంగా మాత్రం కాదని నాలుక తిప్పారు. ఇక తాజాగా ఈయన మరో వివాదాస్పద నిర్ణయానికి తెరదీశాడు. ఫిబ్రవరి 17వ తారీఖున తాను నిర్మిస్తున్న సమంత గుణశేఖర్ల శాకుంతలం రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వాస్తవానికి అదే రోజు మరో మూడు చిత్రాలు ముందుగానే రిలీజ్ డేట్లను ప్రకటించి ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న సర్ చిత్రం అందులో ఒకటి. విశ్వక్సేన్ తానే నటిస్తూ నిర్మిస్తున్న దాస్ కి ధమ్కీ రెండోది. మూడో సినిమా గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇలా తనకంటే ముందుగానే ఫిబ్రవరి 17న రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ మూడు చిత్రాలకు షాకిస్తూ దిల్ రాజు తన శాకుంతలం చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయాలని భావించి రిలీజ్ డేట్ ను ప్రకటించి, ఏకంగా పోస్టర్లు విడుదల చేశారు. ఇది కూడా ప్రస్తుతం తెలుగు నాట వివాదాస్పదమవుతుంది. నైజాం ఏరియాలో స్టార్ హీరోల సినిమాని రిలీజ్ చేయాలంటే అది దిల్ రాజు చేయాల్సిందే. ఇది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే ఈ సాంప్రదాయానికి సంక్రాంతితో బ్రేక్ పెడుతున్నారు కొందరు.
మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 12న విడుదల కాబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి జనవరి 13న విడుదల కానుంది. అంటే పక్కపక్క రోజుల్లో రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలను దిల్ రాజుకి ఇవ్వకూడదని ముందుగానే మైత్రీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారట. అదే అసలు దిల్‌రాజు కడుపు మంటకు కారణమైందనే ప్రచారం కూడా ఉంది. ఈ రెండు సినిమాలను మైత్రి వారే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. నైజాం లో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ తో కలిసి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ని ఏర్పాటు చేసిన మైత్రివారు తాము నిర్మిస్తున్న భారీ సినిమాలను స్వయంగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇది నైజాంలో దిల్ రాజుకు తగులుతున్న బిగ్ షాక్. ఇటీవల మీడియాతో దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇన్ డైరెక్ట్ గా మైత్రి వారి వల్ల తాను హర్ట్ అయినట్టు వెల్లడించారు. లోలోన మైత్రి వారంటే దిల్ రాజు మండిపడుతున్నారు.
అందులోనూ మైత్రి వారు సినిమాల నిర్మాణం చేపట్టిన దగ్గరనుంచి తనకే సినిమాలు ఇస్తూ వస్తున్నారు. వారితో ఆయనకు ఎటువంటి విభేదాలు లేవు. అయితే ఉప్పెన తర్వాత సినిమాలు వారు తనకి ఇవ్వడం లేదని దిల్ రాజు అంటున్నారు. ఇక కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన మైత్రి వారు తాము నిర్మిస్తున్న రెండు భారీ చిత్రాలను తామే రిలీజ్ చేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు మాత్రం కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన మైత్రి వారు రిలీజ్ చేస్తున్న రెండు భారీ సినిమాలతో ఈ రంగంలో ఉన్న ఇబ్బందులు ఏంటో వారికి తెలిసి వస్తాయి... ఏడాది తర్వాతే అసలు విషయం వారికి బోధపడుతుందని అంటూ సెటైర్లు వేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
![]() |
![]() |