![]() |
![]() |

కొందరి మధ్య అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి ముచ్చటేస్తుంది. ఇన్‌స్పయిరింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు రష్మిక, సమంత మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. 'పుష్ప' సినిమాలో రష్మిక హీరోయిన్గా చేస్తే ఎంత పేరు వచ్చిందో, "ఉ అంటావా మావా" పాటకు సమంతకు అంతే మంచి పేరు వచ్చింది. వీరిద్దరూ కలిసి ఇంకేం సినిమాలూ చేయకపోయినా ఒకరంటే ఒకరికి మాత్రం ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.
లేటెస్ట్ గా ఓ తమిళ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నే వెల్లడించారు రష్మిక. "సమంత చాలా అందమైన అమ్మాయి. చాలా గట్స్ ఉన్న అమ్మాయి. ఇండస్ట్రీకి రాకముందు నుంచే తనని చూస్తున్నా. తన ధైర్యానికి ఫిదా అయ్యాను. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొన్న నటి ఆమె. ఆమెకున్న డిసీజ్ గురించి నాకు అంతకు ముందు తెలియదు. తెలిశాక మాత్రం త్వరగా కోలుకోవాలని అనుకున్నాను. ఓ తల్లిగా దగ్గరుండి సమంతను చూసుకోవాలనిపించింది. ఆమె అంటే నాకున్న గౌరవం అలాంటిది" అని చెప్పుకొచ్చారు. సమంత గురించి మాట్లాడుతున్నంత సేపు రష్మిక చాలా జెన్యూన్‌గా కనిపించారు.
ఎప్పుడూ అల్లరిగా సరదాగా మాట్లాడే రష్మిక... సమంత గురించి మాట్లాడుతున్నంత సేపు మాత్రం గంభీరంగా మారిపోయారు. రష్మిక నటించిన 'వారిసు' సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రష్మిక. 'వారిసు' సినిమా ఓపెనింగ్‌లో విజయ్‌తో కలిసి నటిస్తున్నందుకు ఆనందిస్తూ విజయ్‌కి దిష్టి తీస్తున్నట్టు మెటికలు విరిచారు రష్మిక. రీసెంట్గా చెన్నైలో జరిగిన 'వారిసు' వేడుకలో ఆమె డెడికేషన్‌కి తాను దిష్టి తీసి మెటికలు విరుస్తున్నానని చెప్పారు దళపతి విజయ్.
![]() |
![]() |