![]() |
![]() |
.webp)
సినిమా ఇండస్ట్రీ అనగానే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నది చాలా మంది ఒపీనియన్. హీరోయిన్లకు ప్రాధాన్యతనిచ్చి, వారిని అదే పనిగా పొగిడే సందర్భాలు అంత తేలిగ్గా రావు. ప్రతివారం రిలీజ్ పోస్టర్ల మీద కూడా హీరోల ఆధిపత్యమే కనిపిస్తుంటుంది.కానీ లాస్ట్ వీక్ కోలీవుడ్‌లో అన్నీ విమెన్ ఓరియంటెడ్ సినిమాలే రిలీజ్ అయ్యాయి. డ్రైవర్ జమున, రాంగి, సెంబి, ఓ మై గోస్ట్... ఇలా హీరోయిన్లు మెయిన్ లీడ్ చేసిన సినిమాలే రిలీజ్ అయ్యాయి. అంతకు ముందు వారం నయనతార నటించిన కనెక్ట్ విడుదలైంది.
చెన్నై క్రోంపేటలోని ఫేమస్ వెట్రి, రాకేష్ థియేటర్ల కాంప్లెక్స్ లో కనెక్ట్, రాంగి, డ్రైవర్ జమున, సెంబి సినిమాల పోస్టర్లను పెద్దగా వేశారు. థియేటర్ల ముందు ఫ్లెక్సీలను, బ్యానర్లను చూసిన వారు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇన్ని రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి ఇన్ని కావడం చూస్తుంటే ఆనందంగా ఉంది అని సమంతను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ వేశారు.
.webp)
సోమవారం సమంత ట్విట్టర్‌లో కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. ఆమె నటించిన శాకుంతలం సినిమా పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో కాసేపు అభిమానులతోనూ ముచ్చటించారు. ఆ నేపథ్యంలో ఆమెకు ఓ అభిమాని నుంచి విమెన్ ఓరియంటెడ్ సినిమాల పోస్టర్లున్న ఫొటో అందింది. అది చూసిన సమంత పొంగిపోయారు. మహిళలు ఎదుగుతున్నారనడానికి ఇది నిదర్శనం అని అన్నారు. సమంత హీరోయిన్‌గా ఖుషి సినిమా నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం సమంత ఆరోగ్యం కాస్త కుదుటపడుతోంది.
![]() |
![]() |