![]() |
![]() |

కేరక్టర్ ఆర్టిస్టుల్లో కొద్దిమందికి మల్టీలింగ్వుల్ క్రేజ్ ఉంటుంది. అలా తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా అందరికీ సుపరిచితమైన పేరు కిశోర్. చేసే కేరక్టర్‌కి వంద శాతం న్యాయం చేస్తారనే పేరుంది కిశోర్‌కి. తెలుగులో పలు హిట్ సినిమాల్లో ఉన్నారు కిశోర్. రీసెంట్‌గా కాంతారలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
ఆయన ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది. రైతుల సమస్యల మీద విరివిగా స్పందిస్తుంటారు కిశోర్. తన మనసులోని భావాలను ఎలాంటి సంకోచం లేకుండా ట్విట్టర్ వేదికగా వ్యక్తపరుస్తుంటారు. కాశ్మీరి పండిట్స్ ఊచకోత గురించి గతంలో సాయిపల్లవి చేసిన కామెంట్ దుమారం రేపింది. అప్పుడు సాయిపల్లవిని సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేశారు కిశోర్. సినిమావాళ్లకు అభిప్రాయాలు ఉండకూడదా? వాళ్లు సోషల్ ఇష్యూస్ మీద స్పందించకూడదా? అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు కిశోర్.
లోకల్ కథతో తెరకెక్కి కోట్లు కుమ్మరించిన కాంతార సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు కిశోర్. సినిమా అనేది ప్రజల్లో అవగాహన కల్పించడానికే. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో ఉండాలని అంటుంటారు కిశోర్. ఆయన అకౌంట్ ఎందుకు సస్పెండ్ అయిందనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం మీద కిశోర్ కూడా ఇంకా స్పందించలేదు.
![]() |
![]() |