![]() |
![]() |

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులో దాదాపు యంగ్ స్టార్స్ అందరితోనూ చిత్రాలు తీశారు. ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆయనతో పనిచేయని హీరోలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దిల్ రాజు ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం, హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య వంటి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. బృందావనం మంచి విజయం సాధించగా రామయ్య వస్తావయ్య మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. దాదాపు 10 ఏళ్లుగా ఎన్టీఆర్- దిల్ రాజు కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీవరుస కమిట్మెంట్స్ వల్ల ఎన్టీఆర్ తో దిల్ రాజు సినిమా పట్టాలెక్కలేదు.
కానీ ఈ 10 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. ఆర్ ఆర్ ఆర్‌తో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌కి ఎదిగింది. దాంతో ఈసారి దిల్ రాజు ఎన్టీఆర్ తో చిత్రం తీస్తే అది బృందావనం, రామయ్య వస్తావయ్యలాగా సాదాసీదాగా ఉండకూడదు అని యూనివర్సల్ అప్పీల్, యూనివర్సల్ పాయింట్, కంటెంట్ ఉంటేనే చిత్రం చేయాలని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఈ విషయమై దిల్‌రాజు స్పందించారు. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. మా కాంబినేషన్లో సినిమా మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని కదలను ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మా కాంబినేషన్లో తప్పకుండా త్వరలోనే సినిమా ఉంటుంది.... అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివతో 30వ సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 31 సినిమా చేయాల్సి ఉంది. ఆ తరువాత ఏమైనా దిర్రాజుకుడేట్స్ ఇస్తాడేమో చూడాలి. ఎలా చూసుకున్నా 2025 తర్వాతే వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందని మాత్రం స్పష్టం అవుతుంది.
![]() |
![]() |