![]() |
![]() |

యంగ్ హీరోలలో తనదైన విభిన్న చిత్రాలతో దూసుకు వెళ్తున్న యంగ్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా అడివి శేష్ పేరుని చెప్పుకోవాలి. ఆయన ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన నటించిన క్షణం, అమీతుమీ, గూడచారి, ఎవరు, మేజర్, హిట్2వంటివి మంచి విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
మంచి అభిరుచి ఉన్న హీరోగా, స్క్రిప్ట్ రైటర్ గా ఆయనకు పేరు వచ్చింది. ఇక విషయానికి వస్తే అడివి శేష్ హీరోగా గూడచారి 2 ప్రకటన వచ్చింది. దీన్ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. దీనికోసం ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ సినిమాల ద్వారా వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో మేజర్ సినిమాకి ఆయన ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. గూడచారి మొదటి పార్ట్ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే కాంబినేషన్లో మేజర్ చిత్రం వచ్చి ఏకంగా పాన్ ఇండియాలోనే సంచలనం సృష్టించింది.
అలా చూసుకుంటే శేష్ ఎదుగుదలలో శశికిరణ్ ది ప్రధాన పాత్ర. గూడచారి అంత పెద్ద హిట్ కాకపోతే శేష్ వన్ మూవీ వండర్ గా మిగిలిపోయి ఉండేవారు. కానీ ఈ సినిమాతోనే ఆయనకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ ని ఇద్దరూ కలిసి తయారు చేసిన మేకింగ్ అనేది సినిమాకు హైలెట్ అయింది అంటే అది దర్శకుడు శశికిరణ్ టాలెంటే. ఇక మేజర్ సక్సెస్‌లో శశికిరణ్ తిక్క గొప్ప పాత్రను పోషించారు. పలు సందర్భాలలో గూడచారి 2 చిత్రాన్ని కూడా శశికిరణ్ తిక్కానే దర్శకత్వం వహిస్తారని శేష్ అన్నారు.
కట్ చేస్తే ఇప్పుడు మరో దర్శకుడు ఎంటరయ్యారు. దీనితో పలు సందేహాలు మొదలయ్యాయి. అడివి శేష్- శశికిరణ్ తిక్కల మధ్య ఏమైనా క్రియేటివ్ డిఫరెన్స్ లు తలెత్తాయా? లేక కొత్త మేకర్ అయితే మేకింగ్ పరంగా చేంజ్ ఓవర్ ఉంటుందని శేష్ ఇలా ప్లాన్ చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఈ చిత్ర నిర్మాతలు మాత్రం వినయ్ కుమార్ ను కాకుండా శశికిరణ్ తిక్కనే పెట్టుకోవాలని, ఆయన దర్శకత్వం వహిస్తేనే బాగుంటుందని అడివి శేష్ మీద ఒత్తిడి తెస్తున్నారని సమాచారం...!
![]() |
![]() |