![]() |
![]() |

ఇటీవల 'గాడ్ ఫాదర్' చిత్రంతో పలకరించి అభిమానులను ఫుల్ ఖుషీ చేసిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళికి ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం.
చిరంజీవి తన 154వ సినిమాని కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ ఇందులో కీలక పాత్రలో అలరించనున్నాడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీపావళి కానుకగా అక్టోబర్ 24న టైటిల్ తో కూడిన పోస్టర్ ని విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిలే ఫిక్స్ చేశారో లేక మరేదైనా టైటిల్ పెట్టారా అనేది ఈ దీపావళికి తెలియనుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్, బాబీ సింహ, కేథరిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |