![]() |
![]() |

శ్రీకాంత్ అయ్యంగార్ అంటే తొందరగా ఎవరూ గుర్తు పట్టరు కానీ "ప్రతీ రోజూ పండగే" మూవీలో తండ్రి బతికుండగానే సమాధి కట్టించే సీన్లో ఆయన నవ్వులు పూయించనతను అంటే గుర్తోచేస్తుంది. ఆ మూవీ అనే కాదు ఎన్నో మూవీస్ లో ఆయన నటించారు. పెక్యులియర్ వాయిస్ లో పెద్ద కళ్ళతో డైలాగ్ చాలా స్పష్టంగా అర్థవంతంగా చెప్పడంలో దిట్ట.
ఇక ఈయన నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఇక ఈయన బర్త్ డే సందర్భంగా బుల్లితెర కమెడియన్ రచ్చ రవి ఆయన దగ్గరకు వెళ్లి పుట్టినరోజు విషెస్ చెప్పారు. " డాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ అందరికి తెలిసిందే ఒక మంచి నటుడు , డైరెక్టర్ చెప్పిన టైంకి సెట్ లో కనిపించే మంచి మనిషి, తొందర్లో ప్రొడ్యూసర్ కూడా కాబోతున్నాడు..నాకు పెద్ద అన్నయ్య లాంటివాడు, కాఫీ లాంటి మిత్రుడు , శ్రేయోభిలాషి ..అంతకుమించి ... అన్నా మీ మంచి మనసుకు పుట్టినరోజు శుభాకాంక్షలు ..ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..మీ తమ్ముడు యానం రవి " అని కాప్షన్ పెట్టి భారీ తులసి గజ మాల వేసి విషెస్ చెప్పాడు. ఇక ఇదే చిత్రంలో రఘు కుంచె కూడా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఇప్పుడు ఈ వీడియో రచ్చ రవి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నాడు.. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, డియర్ కామ్రేడ్, బ్రోచేవారెవరురా వంటి చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళల్లో ఈయనొకరు.
![]() |
![]() |